BigTV English

Momos Issue: కల్తీ మోమోస్ తయారు చేసిన.. బీహార్‌ గ్యాంగ్‌ అరెస్ఠ్..!

Momos Issue: కల్తీ మోమోస్ తయారు చేసిన.. బీహార్‌ గ్యాంగ్‌ అరెస్ఠ్..!
Advertisement

Momos Issue: ఫుడ్ సెఫ్టీ అధికారులు ఎంత తనిఖీలు చేసిన… జనాల్ని ఎంత ఎవెర్ నెస్ చేసిన అదే తీరు. ఫైస్టార్ హోటల్స్ నుంచి బస్తీల్లో ఫుడ్ స్టాల్స్ వరకు అదే నిర్లక్ష్యం. కల్తీ ఫుడ్ తో జనం ప్రాణాలతో చేలగాటం ఆడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఘటన చోటు చేసుకుంది. వారం వారం జరిగే మార్కెట్ లో ఓ మోమోస్ కౌంటర్ ఏర్పాటు చేశారు. దీంతో అట్రాక్ట్ అయిన కొందరు.. సరదాగా మోమోస్‌ తిన్నారు. ఇంకేముంది మోమోస్ తిన్న పాపానికి హాస్పిటల్‌ పాలయ్యారు. హైదరాబాద్ బంజారాహిల్స్ నంది నగర్‌లో చోటు చేసుకుంది ఈ ఘటన. స్ట్రీట్‌ ఫుడ్‌ తిని పలువురు అస్వస్థతకు గురయ్యారు. మోమోస్‌ తిని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. ఇక అదే స్టాల్ లో మోమోస్ తిన్న మరికొందరు అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వెంటనే అప్రమత్తమైన బాధితులు బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు ఖాకీలు.


మోమోస్ వివాదంలో బంజారాహిల్స్ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. మోమోస్ తిని రీసెంట్‌గా ఓ మహిళ మృతి చెందింది. కల్తీ మోమోస్ తినడం వలనే చనిపోయిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. చింతల్ బస్తీలో మోమోస్ తయారు చేసి బీహార్‌కు చెందిన ఆరుగురు యువకులు సిటీలోని వీక్లీ మార్కెట్స్‌కి సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఆ ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మోమోస్ తిని ఓ మహిళన చనిపోగా.. 50 మందికి పైగా అస్వస్థతకు గురైయ్యారు. దీంతో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. ఈఘటనతో ప్రభుత్వం మోమోస్ అమ్మకాలను నిషేధించింది.

ఇప్పటికే కల్తీ ఆహార పదార్థాలు, పానీయాల దందాను అరికట్టడానికి ఫుడ్‌ సేఫ్టీ అధికారులు నడుం బిగించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార పదార్థాల తయారీ సంస్థలపై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు వరుస దాడులు జరుపుతున్నారు. ఈ దాడుల్లో అధికారులు అవాక్కయ్యే ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కుళ్లిపోయిన నిలువ ఉంచిన మాంసం, కాలం చెల్లిన పాలు, పెరుగు, ఐస్‌ క్రీం ఒక్కటేమిటి.. అసలు ప్రజారోగ్యం గురించి పట్టింపే లేని హోటల్‌ యాజమాన్యాల నిజ స్వరూపం బయట పడుతోంది. అయితే హోటళ్ల నిజస్వరూపం చూసి జనం ఇప్పటికే వణుకుతున్నారు. దీంతో వీధి బండ్లపైనా కూడా ఇదే తరహా ఘటనలు జరుగుతుండటం జనాల్లో వణుకుపుట్టిస్తోంది.


Also Read: కేటీఆర్ పాదయాత్ర.. ప్లాన్ వర్కవుట్ అవుతుందా ?

పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్ మొదలు స్టీట్ ఫుడ్ వరకు అన్నీ కంపుమయమే. బయటికి అందంగా ..శుభ్రంగా ఉండే హోటల్లో.. కిచెన్ పరిసరాలు మాత్రం కంపుకొట్టేలా ఉంటున్నాయని కస్టమర్లు చెబుతున్నారు. ఇదేదో ఆరోపణలు కాదు.. స్వయంగా అధికారులు ఇస్తున్న నోటీసులే దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఇక వీధిలో నడిపే కొన్ని ఫుడ్ స్ట్రాల్స్ అపరిశుభ్రత గురించి అయితే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి హ్యాపీగా ఏ వీకెండ్‌లోనో.. ఫ్యామిలీతో రెస్టారెంట్స్‌కి వెళ్లి ఎంజాయ్ చేద్దాం.. అనుకునే వారు కాస్త చూసుకుని తినాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బీ కేర్ ఫుల్ పీపుల్..

Related News

CM Revanth Reddy: పేదలకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం.. సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు

Jubilee Hills byElection: జూబ్లీహిల్స్ బైపోల్.. నవంబర్ 11న సెలవు ప్రకటించిన రేవంత్ సర్కార్

Jubilee Hills by election: ఫేక్ ఓట్ల విషయంలో అసలు దొంగలెవరో తెలుసా..? ఇదిగో ప్రూఫ్స్‌తో సహా!

Minister Seethakka: తల్లిదండ్రులపై ప్రమాణం చేస్తూ హరీష్ రావుకు మంత్రి సీతక్క సవాల్

Mla Anirudh Reddy: మంత్రుల జిల్లాలకే నిధులు.. నేను కూడా సీఎం అభ్యర్థే: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

HYDRA: కబ్జాలకు చెక్.. రూ. 110 కోట్ల విలువైన ప్ర‌భుత్వ భూమిని కాపాడిన హైడ్రా

Telangana Bandh: రేపు తెలంగాణ బంద్.. డీజీపీ శివధర్ రెడ్డి కీలక ఆదేశాలు

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు.. బీజేపీ సైలెంట్ రాజకీయాలకు సంకేతమేంటి..?

Big Stories

×