E-Paper
Advertisement

BJP Campaign : తెలంగాణకు కేంద్రమంత్రుల క్యూ.. వరుస బహిరంగ సభలు..

BJP Campaign : తెలంగాణకు కేంద్రమంత్రుల క్యూ.. వరుస బహిరంగ సభలు..

BJP Campaign : తెలంగాణలో ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఇంకా 45 రోజుల్లో ఏ పార్టీ తెలంగాణ రాజ్యమేలుతుందో తేలిపోతుంది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా..నేడో రేపో బీజేపీ కూడా జాబితాను ప్రకటించనుంది. దీంతో అసలు సిసలైన పోరు ఇకపై మొదలవ్వబోతోంది. ఈ ముక్కోణ పోరులో.. గెలుపే లక్ష్యంగా రాజకీయ కార్యకలాపాలను బీజేపీ ముమ్మరం చేసింది.

ఎన్నికల షెడ్యూల్‌ రాకముందు నుంచే బీజేపీ తన ప్రచారాన్ని ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే కమలనాథులు తెలంగాణకు క్యూ కట్టారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా సభలు, సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 1న మహబూబ్‌నగర్, 3న నిజామాబాద్‌లలో ప్రధాని మోడీ పర్యటనతో.. కాషాయ పార్టీలో నూతనోత్సాహాన్ని నింపిందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇక షెడ్యూల్‌ వెలువడిన మరుసటి రోజే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదిలాబాద్‌లో జనగర్జన సభ నిర్వహించారు. ఎన్నికల ప్రచార గడువు ముగిసే నాటికి 10 ఉమ్మడి జిల్లాల పరిధిలో మూడేసి చొప్పున మోడీ, అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాల బహిరంగ సభలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఆదివారం హైదరాబాద్‌లో పర్యటించిన కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి ముషీరాబాద్‌, అంబర్‌పేట్‌లో మత్స్య కారుల సమావేశంలో పాల్గొన్నారు.

ఇక నేడు మరో ఇద్దరు కేంద్ర మంత్రులు తెలంగాణలో పర్యటించనున్నారు. మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, పురుషోత్తం రూపాల వేర్వేరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గం జమ్మికుంట బహిరంగసభకు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరుకానున్నారు. ఆ తరువాత మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట్‌ సభలోనూ పాల్గొననున్నారు. ఓ వైపు రాజ్‌నాథ్‌ సింగ్‌ పర్యటన కొనసాగుతుండగానే.. మరో వైపు మరో కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల కూడా పర్యటించనున్నారు. రంగారెడ్డి జిల్లాలో జరిగే బహిరంగ సభకు రూపాలా హాజరుకానున్నారు.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×