BigTV English

Israel – Palastine War : ఇజ్రాయెల్ లో హమాస్ మిలిటెంట్ల మారణహోమం.. షాకింగ్ వీడియో వైరల్..

Israel – Palastine War : ఇజ్రాయెల్ లో హమాస్ మిలిటెంట్ల మారణహోమం.. షాకింగ్ వీడియో వైరల్..

Israel – Palastine War : ఇజ్రాయెల్ – హమాస్ ల మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతుంది. గాజాను తమ ఆధీనంలోకి తీసుకున్న హమాస్ పై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడులు చేస్తోంది. హమాస్ కూడా ఇజ్రాయెల్ పౌరులపై ఇష్టారాజ్యంగా దాడులు చేస్తూ.. వారి ప్రాణాలను తీస్తోంది. తాజాగా హమాస్ మిలిటెంట్లు సరిహద్దు దాటి ఇజ్రాయెల్ లోకి ప్రవేశించి.. అక్కడి పౌరులను కాల్చి చంపుతున్న వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) సోమవారం విడుదల చేసింది. ఈ వీడియోను హమాస్ మిలిటెంట్ ధరించిన బాడీ కెమెరాలో రికార్డు చేసినట్లు తెలుస్తోంది కానీ.. వీడియో ఎప్పుడు తీశారన్న దానిపై స్పష్టత లేదు.


అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన మెరుపుదాడుల సమయంలో ఈ వీడియో చిత్రీకరించినట్లుగా కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.”హమాస్ జిహాదీల దళం అమాయక ఇజ్రాయెల్ కమ్యూనిటీపై దాడి చేసి హతమార్చింది. చిత్రీకరించిన ఉగ్రవాదిని ఇజ్రాయెల్ భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి” అని ఇజ్రాయెల్ సైన్యం ట్విట్టర్ లో రాసింది. ఈ వీడియోను షేర్ చేసిన ఐడీఎఫ్ ట్రిగ్గర్ హెచ్చరిక అని రాసింది.

మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో భారీగా ఆయుధాలను ధరించిన హమాస్ మిలిటెంట్లు బైక్ పై.. గాజా, దక్షిణ ఇజ్రాయెల్ ల మధ్య ఉన్న సరిహద్దును దాటుతున్నట్లు కనిపించింది. భద్రతా బూత్ ను దాటి పౌరుల ఇళ్లలోకి ప్రవేశించి.. వారిపై తుపాకీలతో కాల్పులు జరిపారు. అలాగే ఆగి ఉన్న ఒక అంబులెన్స్ టైర్ ను హమాస్ ఉగ్రివాది తుపాకీతో కాల్చాడు.


గాజా బోర్డర్ కు సమీపంలో ఉన్న నోవా మ్యూజిక్ ఫెస్టివల్ లో ఉన్న టాయిలెట్ స్టాల్స్ లోకి హమాస్ తీవ్రవాది ప్రవేశించినట్లు వీడియో చూపిస్తోంది. అయితే అప్పటికే అక్కడి నివాసితులు పారిపోయి ఉండవచ్చని భావించిన హమాస్.. వారికోసం తీవ్రంగా వెతికారు. కాగా.. ఇజ్రాయెల్ – పాలస్తీన్ మధ్య యుద్ధం మొదలై నేటికి 10 రోజులవుతున్నా.. అక్కడి పరిస్థితులు ఏమాత్రం కంట్రోల్ అవ్వలేదు. ఇప్పటి వరకూ హమాస్ దాడుల్లో 1300 మంది పౌరులు చనిపోగా.. ఇరువైపులా 4000 మంది మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×