E-Paper
Advertisement

BJP Fourth List : బీజేపీ నాలుగో జాబితా విడుదల.. మునుగోడు, వేములవాడ సీట్లు వారికే..

BJP Fourth List : బీజేపీ నాలుగో జాబితా విడుదల.. మునుగోడు, వేములవాడ సీట్లు వారికే..
Advertisement
TS BJP MLA Fourth List

TS BJP MLA Fourth List(Political news in telangana):

తెలంగాణ ఎన్నికల్లో భాగంగా బీజేపీ 12 మంది అభ్యర్థులతో నాలుగో విడత జాబితా ప్రకటించింది. మొత్తంగా నాలుగు విడతల్లో 100 సీట్లను ప్రకటించింది. మునుగోడు నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ చలమల కృష్ణారెడ్డి.. మునుగోడు నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డిని ఢీకొట్టనున్నారు. వేములవాడ నియోజకవర్గం నుంచి తుల ఉమ బరిలో ఉండనున్నారు. ఇక ఎల్లారెడ్డి నుంచి సుభాష్ రెడ్డి.. హుస్నాబాద్ నుంచి శ్రీరామ్ చక్రవర్తి.. సిద్ధిపేట నుంచి దొడ్డి శ్రీకాంత్ రెడ్డి బరిలో దిగనున్నారు. చెన్నూర్ నుంచి దుర్గం అశోక్ పోటీలో ఉండనున్నారు. ఇక రేవంత్ రెడ్డి ఇలాకా అయిన కొడంగల్ నుంచి బంటు రమేష్ కుమార్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

వికారాబాద్ స్థానాన్ని పెద్దింటి నవీన్ కుమార్ కు కేటాయిస్తే .. గద్వాల్ స్థానాన్ని బోయ శివకు కేటాయించారు. మొదటి విడతలో గద్వాల్ స్థానాన్ని డీకే అరుణకు కేటాయించాయి. అయితే ఆమె పోటీ చేయడానికి నిరాకరించారు. దీంతో ఆ సీటు బోయ శివకు ఇచ్చారు. ఇక మిర్యాలగూడ సాధినేని శ్రీనివాస్ బరిలో దిగనున్నారు. నకిరేకల్ నుంచి నకరకంటి మొగిలయ్య ఎన్నికల పోరులో ఉండనున్నారు. ఇక ములుగు టిక్కెట్ అజ్మీరా ప్రహ్లాద్ నాయక్‌కు బీజేపీ కేటాయించింది.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×