BigTV English
Advertisement

Chhattisgarh elections 2023 : ఛత్తీస్‌గఢ్ లో పోలింగ్ .. చెలరేగిన హింస.. ఐఈడీ పేలుడు..

Chhattisgarh elections 2023 : ఛత్తీస్‌గఢ్ లో పోలింగ్ .. చెలరేగిన హింస..  ఐఈడీ పేలుడు..
Chhattisgarh elections 2023

Chhattisgarh elections 2023(Politics news today India):

ఛత్తీస్ గఢ్, మిజోరాంలలో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలవ్వగా.. కొద్దిసేపటికే ఛత్తీస్ గఢ్ లో పేలుడు సంభవించింది. దీంతో మొదటి విడత ఎన్నికల్లో హింస చెలరేగింది. సుకుమా జిల్లా తొండమర్కలో జరిగిన ఐఈడీ పేలుడులో సీఆర్ పీఎఫ్ జవాన్ కు తీవ్రగాయాలయ్యాయి. బాధిత జవాన్ సీఆర్పీఎఫ్ కోబ్రా 206వ బెటాలియన్ కు చెందిన ఇన్ స్పెక్టర్ శ్రీకాంత్ అని అధికారులు వెల్లడించారు.


కాగా.. నక్సల్స్ పాతిపెట్టిన బాంబుపై కాలు వేయడంతో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. నేడు అక్కడ 20 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా.. వాటిలో పేలుడు జరిగిన కొంటా అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఉంది. తొలివిడత పోలింగ్ జరుగుతున్న 7 జిల్లాలు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. బస్తర్, జగదల్ పూర్, చిత్రకోట్ లో సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుండగా.. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగియనుంది.


Tags

Related News

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Muzaffarnagar: కళాశాల విద్యార్థినులకు వేధింపులు.. యూపీ పోలీసుల స్పెషల్ ట్రీట్‌మెంట్

Train Collides: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని 10 మంది మృతి, పలువురికి గాయాలు

Delhi Air Pollution: ఇక బతకడం కష్టమే! గ్యాస్ చాంబర్‌లా మారిన ఢిల్లీ

PAN Aadhaar Link: పాన్ కార్డు-ఆధార్ లింక్ తప్పనిసరి.. డిసెంబర్ 31 వరకు గడువు.. ఆన్ లైన్ లో లింకింగ్ ఎలా?

Dog Bite Victims: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక మలుపు.. బాధితుల జోక్యానికి గ్రీన్ సిగ్నల్!

Supreme Court: భారత్ లో పోర్నోగ్రఫీ బ్యాన్ చేయాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన రాష్ట్రాల సీఎస్‌లు

Big Stories

×