BigTV English

Mp Laxman angry on Kcr: ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ, కేసీఆర్‌ దేశ ద్రోహం, వెతకవైఖరి వద్దంటూ

Mp Laxman angry on Kcr:  ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ, కేసీఆర్‌ దేశ ద్రోహం, వెతకవైఖరి వద్దంటూ

Mp Laxman angry on KCR(Telangana politics): ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి రావడంతో తెలంగాణ బీజేపీ రియాక్ట్ అయ్యింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఫోన్ ట్యాపింగ్ విషయంలో అప్పటి కేసీఆర్ సర్కార్ దేశ ద్రోహానికి పాల్పడిందని ఆరోపించారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు కేసీఆర్ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు.


ఫోన్ ట్యాపింగ్‌పై రేవంత్ సర్కార్ ఎందుకు మెతక వైఖరి ప్రదర్శిస్తోందన్నారు ఎంపీ లక్ష్మణ్. తప్పు చేస్తే జైలుకి పంపిస్తామని చెప్పిన సీఎం రేవంత్, కొత్త విషయాలు వెలుగులోకి వస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రమేయంతోనే ఇదంతా జరిగిందని పోలీసు అధికారులు వాంగ్మూలం లో చెబుతున్నారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో కేసీఆర్ ఒక మాఫియాను నడిపించారని వ్యాఖ్యానించారు.

రాజకీయ ప్రయోజనాల కోసం నాయకులు, ఇతర వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని కేసీఆర్‌పై విరుచు కుపడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఫేక్ డ్రామా అని తాను ముందే చెప్పానన్నారు. ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిగితే న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పెద్దల ఒత్తిడితో కేసును నీరుగార్చవద్దని సూచన చేశారు.


ALSO READ: ఫోన్ ట్యాపింగ్ కేసు.. తీగలాగితే డొంక, జడ్జీలు, అడ్వకేట్ సహా..

అందెశ్రీ రాసిన పాటను తాము స్వాగతిస్తున్నామన్నారు ఎంపీ లక్ష్మణ్. ఆయన రాసిన పాట ప్రజలందరికీ ప్రేరణ కలుగుతుందన్నారు. ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసు కుంటాయన్నారు. పనిలో పనిగా ఎన్నికల ఫలితాలపై తనదైన శైలిలో జోస్యం చెప్పారు. తెలంగాణలో ఈసారి డబుల్ డిజిట్ సీట్లను గెలుచుకుంటామన్నారు. ఈసారి గెలుపు తమదేనని కుండబద్దలు కొట్టేశారు. మూడోసారి కూడా ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపడతారన్నారు. ఏ దశలో పోలింగ్ చూసినా బీజేపీకి క్లియర్ మెజార్టీ వస్తుందన్నారు. తమ పార్టీ 400 సీట్ల గెలుచుకోవడం ఖాయమన్నారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మన్.

Tags

Related News

Fake APK App: హైదరాబాద్‌లో ఫేక్ ఏపీకే యాప్‌ల ఘరానా మోసం.. రూ.4.85 లక్షలు ఖేల్ ఖతం, దుకాణం బంద్..

Formula-E Race Case: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు.. ఇద్దరు ఐఏఎస్ లపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు

Telangana Group-1 Exam: టీజీపీఎస్సీకి హైకోర్టులో రిలీఫ్.. తెలంగాణ గ్రూప్-1 నియామకాలకు గ్రీన్‌సిగ్నల్

Hyderabad News: జూబ్లీహిల్స్ బైపోల్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు, ఇంకా భ్రమల్లో ఆ పార్టీ

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Big Stories

×