BigTV English

Long Time Sitting: ఎక్కువ సేపు కూర్చొని పని చేసేవారికి ఈ అనారోగ్య సమస్యలు తప్పవు

Long Time Sitting: ఎక్కువ సేపు కూర్చొని పని చేసేవారికి ఈ అనారోగ్య సమస్యలు తప్పవు

Side Effects Of Sitting Long Hours: ప్రస్తుతం చాలా మంది ఆఫీసుల్లో, ఇంట్లోను ల్యాప్ టాప్ ముందు గంటల తరబడి కూర్చుకుంటున్నారు. చాలామంది పని మొదలు పెడితే అది పూర్తయ్యేంత వరకూ కూర్చున్న ప్లేస్ నుంచి లేవరు. అలాగే ఎనిమిది నుంచి 10 గంటల పాటు స్క్రీన్ కు అతుక్కుని పోయేవారు చాలా మంది ఉంటారు. ఇలా గంటల తరబడి కూర్చొవడం, శరీరక శ్రమ లేకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.


ప్రతి ఒక్కరికీ పని చాలా ముఖ్యం. శరీరానికి విశ్రాంతి కూడా అంత కంటే ఎక్కువ అవసరం. ఆఫీసులో ఎక్కువ సేపు కూర్చోవడం, గంటల తరబడి కదలకుండా కుర్చీలో కూర్చోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆఫీసులో గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవడం నేడు సర్వసాధారణమైపోయింది.ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇదే క్రమం కొనసాగుతోంది.

టీవీ చూస్తున్నప్పుడు, ఆహారం తింటున్నప్పుడు లేదా మొబైల్ ఫోన్‌లను ఉపయోగిస్తున్నప్పుడు కూడా కూర్చొని ఉంటాము. ఎక్కువ సేపు ఇలా కూర్చోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. పలు అధ్యయనాల ప్రకారం.. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వెన్నునొప్పి వస్తుంది. కండరాలు, ఎముకలు బలహీనపడతాయి. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కలిగే నష్టాల గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.


ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే నష్టాలు:

బరువు: ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మన శరీరంలో కేలరీలు ఖర్చు కావు. దీంతో క్రమంగా బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. బరువు పెరగడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి.

మధుమేహం: ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ చర్య ప్రభావితం అవుతుంది. ఇది క్రమంగా రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. దీని వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది.

గుండె వ్యాధులు: ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల రక్తప్రసరణ తగ్గుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. కూర్చోవడం వల్ల అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు కూడా పెరుగుతుంది.

Also Read: నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో కాఫీ తాగుతున్నారా.. ?

క్యాన్సర్ : పెద్దపేగు క్యాన్సర్ , రొమ్ము క్యాన్సర్ సహా పలు రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. గంటల తరబడి కూర్చోవడం వల్ల అనేక రకాల వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఎముకలు, కండరాలు: ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల ఎముకలు, కండరాల కదలికలు తగ్గుతాయి. తద్వారా  బలహీనులవుతారు. దీనివల్ల ఆస్టియోపొరోసిస్, ఫాల్స్, బ్యాక్ పెయిన్ వంటి సమస్యలు వస్తాయి.

(Disclaimer : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్ ద్వారా సేకరించబడినది. bigtvlive.com దీన్ని ధృవీకరించడం లేదు.)

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×