Shubman Gill – Ridhima Pandit: టీమిండియా, ఐపీఎల్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ ప్లేయర్ శుబ్ మన్ గిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ వైపు వెళ్లడంతో అనూహ్యంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ అయ్యాడు గిల్. గతేడాది జింబాబ్వే సిరీస్ లోనూ భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించి ఆకట్టుకున్నాడు.
Also Read: Ambani – Rohit: బలుపు తగ్గించుకో రోహిత్… అంబానీ వార్నింగ్?
అయితే ఐపీఎల్ 2024 సీజన్ లో పెద్దగా రాణించకపోవడంతో వార్తల్లో నిలిచాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్ సోషల్ మీడియాలో “క్లీన్ స్లేట్..కొత్త కథ” అని రషీద్ ఖాన్ ఫోటో ని షేర్ చేసింది. దీంతో గుజరాత్ జట్టు కెప్టెన్ గా రషీద్ ఖాన్ ని గుజరాత్ ఎంపిక చేయబోతుందని ఊహగణాలు మొదలయ్యాయి. దీంతో గిల్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇలా క్రికెట్ అంశాలతోనే కాకుండా గిల్ చాలాసార్లు తన రిలేషన్షిప్ విషయాలతోనూ వార్తల్లో నిలిచాడు.
గతంలో లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో గిల్ డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. కానీ ఈ యువ ఆటగాడు ఓ బాలీవుడ్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడని తాజాగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ అందాల భామ ఎవరంటే..? ప్రముఖ మోడల్, హిందీ నటి రిద్దిమా పండిట్. అంతే కాదు వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే రూమర్స్ వైరల్ గా మారాయి. దీంతో ఈ రూమర్స్ పై స్పందించింది రిద్దిమా.
ఈ రూమర్స్ గురించి ఏం చెప్పాలో తనకు అర్థం కావడం లేదని తెలిపింది. ఇప్పటివరకు వినని హాస్యాస్పదమైన, విచిత్రమైన వార్తలు వింటున్నానని చెప్పుకొచ్చింది. నేనెప్పుడూ గిల్ ని చూడలేదని, కేవలం టీవీలలో చూడడం తప్ప.. నేరుగా అతడిని ఇంతవరకు చూడలేదని అన్నారు. మేమిద్దరం వివాహం చేసుకోబోతున్నామంటూ వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని కొట్టిపారేసింది రిద్దిమా. కానీ మేము ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని సోషల్ మీడియాలో శుభాకాంక్షలు రావడం మాత్రం నిజమేనని చెప్పుకొచ్చింది.
Also Read: Yuvraj Singh on Rohit Virat: ఎవర్రా మీరంతా.. రోహిత్, కోహ్లీని తిట్టడానికి? యువరాజ్ సీరియస్!
తనకి ఒకవేళ గిల్ ఎదురైతే.. ఈ విషయంపై నవ్వుకుంటామని పేర్కొంది. ఇలాంటి రూమర్స్ ని ఎందుకు వ్యాప్తి చేస్తున్నారో అర్థం కావడంలేదని.. నా పెళ్లి విషయాన్ని మా తల్లిదండ్రులు చూసుకుంటారని తేల్చి చెప్పింది. ఇక గిల్ భారత జట్టు తరుపున మరింత బాగా ఆడాలని కోరుకుంటున్నానని అతడికి ఆల్ ది బెస్ట్ తెలిపింది. తాను ప్రస్తుతం ఎవరితోనూ రిలేషన్ షిప్ లో లేనని స్పష్టం చేసింది. అయితే కొత్త రిలేషన్ కోసం తాను సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఇలాంటి రూమర్స్ కారణంగా ఇప్పుడు నా దగ్గరకు వచ్చేవారు ఎవరు ఉండరు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇక ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గిల్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఐదు ఇన్నింగ్స్ లు ఆడిన గిల్ కేవలం 93 పరుగులు మాత్రమే చేశాడు.