
Pawan Kalyan: పవన్‌కల్యాణ్ మామూలోడు కాదు. రాజకీయాల్లో ఎంతగా యాక్టివ్ ఉంటున్నారో.. సినిమాలు సైతం అంతే స్పీడ్‌గా కంప్లీట్ చేస్తున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్, ‘ఓజీ’ మూవీస్ షూటింగ్ వేగంగా జరుగుతోంది.
‘ఓజీ’: ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్. సుజీత్ డైరెక్షన్‌లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్. డీవీవీ దానయ్య నిర్మాత. లేటెస్ట్‌గా ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో సంథింగ్ డిఫరెంట్‌గా ఉంది.
డైరెక్టర్ సుజీత్ ‘ఓజీ’ స్టోరీకి తుది మెరుగులు దిద్దుతున్నట్టు ఉంది. క్లైమాక్స్ సీన్ కోసం అనేక వర్షన్లు రాస్తున్నట్టు చూపించారు. కత్తి, తుపాకీ లాంటి ఆయుధాలు కనిపించాయి. క్రియేటివ్‌గా వదిలిన ఈ వీడియో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఓజీ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. వచ్చే వారం పవన్ కల్యాణ్ షూటింగ్‌లో జాయిన్ అవుతారు.
మరోవైపు, ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. పోలీస్ యాక్షన్ డ్రామా. హరీశ్ శంకర్ డైరెక్షన్. టైటిలే అదిరిపోయింది. ఇక సినిమా ఎలా ఉంటుందో చెప్పాలా? అసలే, పవన్-హరీశ్ శంకర్ కాంబినేషన్ కేక. ఈసారి కూడా హిస్టరీ రిపీట్ అవడం పక్కా అంటున్నారు.
‘ఉస్తాద్ భగత్‌సింగ్’కు సంబంధించి ఇటీవలే ఓ ఫుల్లీలోడెడ్ యాక్షన్ ఎపిసోడ్ కంప్లీట్ చేశారు. వెయ్యి మంది ఫైటర్స్‌తో.. రామ్-లక్ష్మణ్ స్టైల్.. యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. ఒక్కో ఫైట్ సీన్ అదిరిపోతుందని అంటున్నారు. పవన్ మాసిజాన్ని పూర్తిగా వాడేసుకున్నారట రామ్-లక్ష్మణ్. పోలీస్‌స్టేషన్‌లోనూ కొన్ని కామెడీ సీన్స్ తీశారని చెబుతున్నారు.
ఇలా, ‘ఉస్తాద్ భగత్‌సింగ్’, ‘ఓజీ’ షెడ్యూల్స్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ.. ఏపీలో ఎన్నికల వేడి రగిలేలోగా.. చేతిలోని సినిమాలన్నీ కంప్లీట్ చేసేసేలా డే అండ్ నైట్ కష్టపడుతున్నారు పవన్ కల్యాణ్.