BigTV English

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు.. మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ అరెస్టుకు రంగం సిద్ధం

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు.. మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ అరెస్టుకు రంగం సిద్ధం

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మాజీ చీఫ్ ప్రభాకర్ అరెస్టుకు రంగం సిద్ధమయింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో SIB మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ కోసం పోలీసులు బ్లూ కార్నర్‌ నోటీసులు జారీ చేశారు. తెలంగాణ CID ద్వారా బ్లూ కార్నర్‌ నోటీసులు ఇష్యూ అయ్యాయి.


నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తి పారిపోయిన సందర్భంలో అతడికి సంబంధించిన సమాచారం. అతడు ఏ ప్రదేశంలో ఉన్నాడనే వివరాలను తెలుసుకోవడానికి విచారణలో భాగంగా బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టులను అలెర్ట్ చేస్తారు. దీని ద్వారా అతడు ఏ ఎయిర్ పోర్టుకు వచ్చిన అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది.

ఈ బ్లూ కార్నర్ నోటీసు నుంచి వచ్చే సమాచారం ఆధారంగా..తర్వాత రెడ్ కార్నర్ నోటీసు జారీ అవుతుంది. రెడ్ కార్నర్ నోటీసు సీబీఐ లేదా ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టర్ ద్వారా జారీ చేస్తారు. అమెరికాకు సంబంధించిన ఇంటర్ పోల్ ద్వారా పోలీసులకు సమాచారం అందించి ఆ వ్యక్తిని నేరుగా ఎయిర్ పోర్టు నుంచి ఇండియాకు తీసుకు రావడానికి రెడ్ కార్నర్ నోటీసు ఉపయోగపడుతుంది. మొదటి దశగా మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ కోసం బ్లూ కార్నర్ నోటీసు జారీ అయింది. బ్లూ కార్నర్ నోటీసులతో ఆయన అరెస్ట్ కు రంగం సిద్ధమయింది.


జూన్ 2 తర్వాత ఇండియాకు వస్తానని మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ పోలీసులకు తెలిపినా పోలీసులు ఆయనను విశ్వసించడం లేదు. కేవలం ప్రభుత్వం మారిపోతే ఫోన్ ట్యాపింగ్ కేసు బయట పడుతుందనే ఉద్దేశంతోనే  అమెరికా వెళ్లిపోయారని పోలీసులు చెబుతున్నారు. వారు హైదరాబాద్ కు వస్తేనే కీలక విషయాలు బయటపడతాయపని పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు.

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చేశారు. అందులో భాగంగానే ప్రభాకర్ రావులను ప్రధాన నిందితుడిగా చేర్చుతూ కోర్టులో మెమో కూడా దాఖలు చేశారు. ప్రభాకర్ రావుతో పాటు ప్రయివేటు వ్యక్తిని కూడా నిందితుడిగా చేర్చారు. ప్రభాకర్ కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందని పోలీసులు నిర్థారించారు.

Also Read: నోట్ల కట్టలు.. ఏసీపీ ఉమ అరెస్ట్, కాసేపట్లో కోర్టుకు

ఎస్ఐబీలోని హార్డ్ డిస్క్ ధ్వంసంలో ప్రధాన సూత్రదారి ప్రభాకర్ రావు అని, అతడి ఆదేశాలతోనే హార్ట్ డిస్క్ ప్రణీత్ రావు  ధ్వంసం చేసినట్లు విచారణలో బయటపడింది. ఫోన్ ట్యాపింగ్ కేసు తర్వాత ప్రభాకర్ రావు అమెరికా వెళ్లి పోయాడు. దీంతో పోలీసులు ప్రభాకర్ రావు కోసం లుక్ అవుట్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే .

 

Tags

Related News

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Mallareddy: మల్లారెడ్డి యూటర్న్.. రాజకీయాల్లో నో రిటైర్మెంట్

Telangana rains: మళ్ళీ ముంచెత్తనున్న వర్షాలు.. ఆగస్టు 14 నుండి 17 వరకు జాగ్రత్త!

Big Stories

×