BigTV English

Cobra – Mongoose Fighting: పాము – ముంగీసుల పోరాటం.. ఎవరిదీ పై చెయ్!

Cobra – Mongoose Fighting: పాము – ముంగీసుల పోరాటం.. ఎవరిదీ పై చెయ్!

Black Cobra – Mongoose Fighting: ప్రపంచంలో తరచూ ఎన్నో వింతలు జరుగుతూనే ఉంటాయి. ఈ ఘటనలు అనునిత్యం ప్రజలను ఆశ్చర్యపరుస్తూపే ఉంటాయి. ఇటువంటి పలు రకాల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతుంటాయి. ఇందులో ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలు ఎప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. నెటిజన్లు ఇటువంటి వీడియోలను చూడటానికి ఎక్కువగా ఇంటరెస్ట్ చూపుతుంటారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో హల్‌చల్ చేస్తుంది. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చే జరుగుతుంది. అదేంటో ఆలస్యం చేయకుండా చూసేయండి.


సాధారణంగా పాములు పొదలు, అడవులు, నీటి ప్రవాహం ఉన్నచోట నివసిస్తుంటాయి. ఎందుకంటే వాటికి అక్కడే ఆహారం దొరుకుతుంది. అంతే కాకుండా ఎటువంటి ప్రమాదాల బారినపడకుండా సురక్షితంగా ఉంటాయి. అయుతే పాములు ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో జీవిస్తాయి. పొరపాటున అవి మన కంట్లో పడ్డాయంటే చాలు భయంతో గజగజ వణికిపోతాము. కోబ్రా ఒక్క కాటేసిందంటే మనిషి ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోతాయి. అలానే పాములు రకరకాల జంతువుల ప్రాణాలను కూడా విషంతో తీసేస్తాయి.

పాములను చూడగానే చాలా జంతువులు భయంతో పారిపోతాయి. ఎందుకంటే పాములు విషపూరితమైనవి. అవి కొన్ని సందర్భాల్లో ఆహారం కోసం ఇళ్లలోకి చొరబడి కోళ్లను, ఎలుకులను కూడా తింటుంటాయి. అయితే పాములు ఇలా అన్ని జంతువులను వేటాడలేవు. పాములకు కూడా కొన్ని జంతువులంటే వణుకు పడుతుంది. ఆ జంతువు ఏదంటే ముంగీసు. ఇవి పాములను వేటాడి మరీ చంపుతాయి. మీరు గమనించినట్లయితే పాములంటే విపరీతమైన  భయం ఉన్నవారు.. ముంగీసులను పెంచుకుంటుంటారు.


Also Read: King Cobra Catching: 20 అడుగుల కింగ్ కోబ్రా.. 20 నిమిషాల పాటు స్నాక్ క్యాచర్ కి ముచ్చెమటలు పట్టించిన పాము!

ఇప్పుడు మనం మాట్లాడుకొనే సంఘటన కూడా ఇటువంటిదే. కానీ ఇది మనుషులు నివశించే ప్రాంతంలో జరగలేదు. ఎక్కడో దట్టమైన అడవిలో జరిగింది. ఓ నాగుపాము, ముంగీసు రెండు ఎదురయ్యాయి. దీంతో రెండు భీకరమైన దాడికి దిగాయి. ముంగీసును చూడగానే పాము.. బుసలు కొడుతూ దానిపైకి దూకుతుంది. ముంగీసు మాత్రం తెలివిగా దాని తప్పించుకుంటూ దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. రెండూ కూడా దాడులు మీద దాడులు చేసుకుంటుంటాయి.

https://youtube.com/shorts/B0zxqaoJuOI?si=3QIWZi8BfyyfDYJR

Also Read: వామ్మో.. దూడను మింగేసిన భారీ కొండచిలువ.. కక్కలేక మింగలేక ఇక్కట్లు.. ఒళ్లుజలదరించే వీడియో

ఒక టైమ్‌లో పాము నడుము వరకు పైకి లేచి ముంగీసుపైకి దూకుతుంది. ఇంతలో ముంగీసు దాని నుంచి జంప్ కొట్టి పాము తలను పట్టుకుంటుంది. దీంతో ఏమి చేయలేని స్థితిలో పాము ఉండిపోతుంది.ఈ వీడియో Prathamesh Sirsat అనే యూట్యూబ్ ఛానెల్ నుంచి అప్‌లోడ్ అయింది. ఈ ఛానెల్ ఇప్పటికే 276 అనేక పాములకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి.  పరమేష్ పాములను రక్షిస్తుంటాడు. ఈ వీడియోకి ఇప్పటికే మిలియన్ల కొద్ది వ్యూస్, లైకులు, కామెంట్లు ఉన్నాయి.

Tags

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×