BigTV English

CRPF Schools Bomb Threat: సీఆర్పీఎఫ్ పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. ఆపై పోలీసుల టెన్షన్, చివరకు

CRPF Schools Bomb Threat:  సీఆర్పీఎఫ్ పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. ఆపై పోలీసుల టెన్షన్, చివరకు

CRPF Schools Bomb Threat: దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపు కాల్స్ రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఈ వ్యవహారం పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒకప్పుడు హస్తినకే పరిమితమైన ఈ తరహా బెదిరింపులు, క్రమంగా మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తోంది. కేంద్ర స్థాయి సంస్థలను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. లేటెస్ట్‌గా దేశవ్యాప్తంగా సీఆర్‌పీఎఫ్‌ పాఠశాలలకు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ పాఠశాలల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.


ఇందులో భాగంగా హైదరాబాద్ ఉదయం జవహర్‌నగర్ పరిధిలోని సీఆర్‌పీఎఫ్‌ పాఠశాలల్లో మంగళవారం ఉదయం బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. పాఠశాల పిల్లలను, సిబ్బంది క్షేమంగా వారి వారి ఇళ్లకు తరలించారు. అనంతరం తనిఖీలు ముమ్మరం చేసింది.

స్కూల్ లోపలకు ఎవరినీ రాకుండా కట్టదిట్ట భద్రత చేశారు పోలీసులు. సీఆర్‌పీఎఫ్‌ అధికారులు, రాచకొండ సీపీ సుధీర్ బాబు, కుషాయిగూడ ఏసీపీ ఆయా ప్రాంతానికి చేరుకుని పరిశీంచారు. బాంబు బెదిరింపులు, మెయిల్స్ రావడంపై సామాన్యులు సైతం మండిపడుతున్నారు.


కరెక్టుగా విధులు నిర్వహించకపోవడం వల్లే ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు. రెండు నెలల కిందట ఢిల్లీలో కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తింది. స్కూల్, హాస్పటల్, ఎయిర్‌పోర్టులను వదల్లేదు ఆకతాయులు.

ALSO READ: కుక్కను తరుముతూ.. 3వ అంతస్తుపై నుంచి పడ్డ యువకుడు, ‘బిగ్ టీవీ’ ఎక్స్‌క్లూజివ్ విజువల్స్

మరోవైపు దేశవ్యాప్తంగా విమానాలకు తరచూ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. సోమవారం రాత్రి కూడా 30 విమానాలకు బెదిరింపులు వచ్చినట్టు విమానయాన వర్గాలు చెబుతున్నాయి. ఇందులో దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఉన్నాయి. దీంతో విమానాలను క్షుణ్నంగా తనిఖీలు చేయించి పంపిస్తున్నారు. గడిచిన వారంలో 120కి పైగానే విమానాల సంస్థలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×