Priyanka Singh : బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, బుల్లితెర నటి ప్రియాంక సింగ్ (Priyanka Singh) ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈరోజు ఉదయం ఆమె తండ్రి బీబీ సింగ్ మరణించడంతో ప్రియాంక సింగ్ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న బీబీ సింగ్ ఈరోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తోంది. ప్రియాంక సింగ్ స్వయంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి తన తండ్రి మరణించిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. దీంతో ఆమె ఫాలోవర్స్, స్నేహితులు బిబి సింగ్ కు నివాళులు అర్పిస్తూ ప్రియాంక సింగ్ ధైర్యంగా ఉండాలని ఓదారుస్తున్నారు.
కాగా ప్రియాంక సింగ్ శ్రీకాకుళానికి చెందిన ట్రాన్స్ జెండర్ అన్న సంగతి తెలిసిందే. గతంలో సాయి తేజగా ఉన్న ఆమె లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారింది. ఆ తర్వాత ప్రియాంక సింగ్ (Priyanka Singh) అని పేరు మార్చుకున్న ఆమె బుల్లితెరపై పలు షోలలో మెరిసింది. అయితే నిజానికి ట్రాన్స్ జెండర్ గా మారిన విషయాన్ని ముందుగా ఆమె తల్లిదండ్రుల దగ్గర చెప్పలేదు. చాలాకాలం ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచిన ప్రియాంక బిగ్ బాస్ హౌస్ లో బయట పెట్టింది.
ప్రియాంక సింగ్ బిగ్ బాస్ 5 లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. చివరిదాకా అయితే వెళ్లలేకపోయింది. కానీ హౌస్ లో ఉన్నన్ని రోజులు ఇతర కంటెస్టెంట్ల మాదిరిగా కాకుండా తన గేమ్ తాను ఆడి సెపరేట్ గా ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది. ఆ టైంలో తను ఒక ట్రాన్స్ జెండర్ అన్న విషయాన్ని తండ్రికి తెలియజేస్తూ కన్నీరు మున్నీరు అయ్యింది. ఇక బిగ్ బాస్ వేదికగా తన తండ్రికి అమ్మాయిగా మారిపోయానని ట్రాన్స్ జెండర్ ఆపరేషన్ చేయించుకున్న విషయాన్ని తండ్రికి తెలియజేసింది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రియాంక సింగ్ (Priyanka Singh) నిర్ణయాన్ని ఆమె తండ్రి తో పాటు కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు.
కాగా ఒకానొక సందర్భంలో ప్రియాంక సింగ్ (Priyanka Singh) తన తండ్రికి ఓ ప్రమాదంలో కళ్ళు పోయాయని, దీంతో ఫ్యామిలీలో ఉన్న అన్నయ్యలు, చెల్లెల్లు పట్టించుకోకుండా ఉండడంతో తానే స్వయంగా తల్లిదండ్రుల బాధ్యతను తీసుకున్నానని వివరించింది. ఈ నేపథ్యంలోనే ప్రియాంక సింగ్ తల్లిదండ్రులకు ఒక సొంత ఇంటిని కూడా కట్టించింది. ఇక తను ఎంతో ఇష్టపడే తండ్రి అనారోగ్యంతో కన్ను వేయడంతో ప్రియాంక సింగ్ కన్నీటి పర్యంతమైంది.
ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక ప్రియాంక సింగ్ కు పెద్దగా ఆఫర్లేమీ రాలేదు. అప్పుడప్పుడు ఫోటో షూట్లు, ఇతర ప్రమోషన్స్ చేసుకుంటూ ఆమె కాలాన్ని గడుపుతోంది. అంతేకాకుండా ఓ యూట్యూబ్ ఛానల్ ను కూడా నడుపుతోంది ప్రియాంక సింగ్ (Priyanka Singh) . ఈ యూట్యూబ్ కు ఫాలోవర్స్ సంఖ్య భారీగానే ఉంది. ఇక తాజాగా ప్రియాంక సింగ్ తన తండ్రి అనారోగ్యంతో కన్నుమూసిన విషయంతో వార్తల్లో నిలిచింది.