E-Paper
Advertisement

డేంజర్ బెల్స్.. ఇటుక బట్టీల కాలుష్యంతో అల్లాడుతున్న ఐదు గ్రామాలు!

డేంజర్ బెల్స్.. ఇటుక బట్టీల కాలుష్యంతో అల్లాడుతున్న ఐదు గ్రామాలు!
Advertisement

Brick Kilns: స్వేచ్ఛ బ్యూరో: ఒకప్పుడు మఖ్తల్ నియోజకవర్గం పర్యావరణ కాలుష్యం లేని ప్రాంతం గత కొన్ని సంవత్సరాల క్రితం ఒక్క ఇటుకబట్టితో ప్రారంభమై ఈరోజు పదుల సంఖ్యలో ఇటుక బట్టీలు వెలియడంతో వేసేవి కాలంలో ఎండ తీవ్రత కన్నా ఇటుక బట్టీల వల్ల మఖ్తల్ నియోజకవర్గంలో 41° శాతం వేడి పెరిగిందని, సాయంత్రం కాను దట్టమైన పొగతో ఈ ప్రాంతం పూర్తిగా కాలుష్యంగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే తమ సమస్యలను పరిష్కరించాలంటూ 2024 సంవత్సరంలో కాట్రేవుపల్లి,రాయికోడ్, గొల్లపల్లి,దండు,మఖ్తల్ గ్రామాల ప్రజలు నిరంతరం ఇటుక బట్టీల నుండి వచ్చే విపరీతమైన దుమ్ము,వేసవికాలంలో వేడితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అదేవిధంగా కాట్రేవుపల్లి,రాయికోడ్ గ్రామాలకు వెళ్లే రహదారి వర్షాకాలంలో చిన్నపాటి వర్షం కురిస్తే బుర్జమయం కావడంతో రోడ్డుపై వెళ్లేందుకు వాహనదారులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని పలుమార్లు తాసిల్దార్ కు వినతి పత్రాలు అందజేసినప్పటికీ కూడా పట్టించుకోకపోవడంతో 11 సెప్టెంబర్ 2024 నాడు తాసిల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్ష చేపట్టారు.

చర్యలు శూన్యం..

చెరువులను పరిరక్షించడం, ఇటుక బట్టీల తొలగింపు పై రైతులు ఐదు గ్రామాల ప్రజలు తాసిల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్ష పట్టిన సమాచారం తెలుసుకున్న కలెక్టర్ కోయ శ్రీ హర్ష సానుకూలంగా స్పందించి వెంటనే చెరువులను పరిరక్షణ చర్యలో భాగంగా వండ్రు మట్టి తరలింపుకు అడ్డుకట్టు వేస్తూ కాట్రేవుపల్లి రోడ్డు సమీపంలో ఉన్నటువంటి ఇటుక బట్టలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని మఖ్తల్ తహసిల్దార్ సతీష్ కుమార్ కు ఆదేశాలు జారీ చేయడంతో తాసిల్దార్ హామీ మేరకు ఒక్కరోజులోనే రిలే నిరాహార దీక్షను రైతులు విరమించారు. రైతుల నిరాహార దీక్ష విరమించి సంవత్సరం కాలం గడిచినా కూడా ఇటుక బట్టీల తొలగింపు చర్యలు ఏమాత్రం కనపడకపోవడంతో తాసిల్దార్ సతీష్ కుమార్ కలిసి వివరణ కోరగా అంజాద 2024 సెప్టెంబర్ నెలలో ఇటుక బట్టల యజమానులకు నోటీసులు జారీ చేయడం జరిగిందని అయితే ఇటుక బట్టీల యజమానులు ఇటుక బట్టీల తరలింపుకు కొంత గడువు కోరినట్టు తెలిపారు.

తహసిల్దార్‌కు వినతి పత్రం..

Advertisement

అయితే వారికి ఇచ్చిన గడువు కాలం పూర్తయిన కూడా ఇటుక బట్టీలు తొలగించకపోగా మళ్ళీ బట్టీలకు వండ్రు మట్టి వేసుకుంటున్నారని ఆ ప్రాంత రైతులు ప్రజలు తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఇటుక బట్టీలను తొలగించేలా నోటీసులు అందజేయాలని వెంటనే తాసిల్దార్ గ్రామ పంచాయతీ సెక్రెటరీలకు ఆదేశాలు జారీ చేయడంతో ఆర్ ఐ,జిపిఓ లు ఇటుక బట్టీల యజమానులకు నోటీసులు జారీ చేశారు. అసలు నారాయణపేట జిల్లాలో అధికారుల మధ్య సమన్వయం ఉందా లేదన్న అపోహ ప్రజల్లో నెలకొంది. అసలు చెరువులలో పకృతి సంపద అయిన వండ్రు మట్టిపై రైతులకు అవగాహన కల్పించే అధికారులు జిల్లాలో ఉన్నారా అన్న సందేహం ప్రజల్లో నెలకొంది. రైతు తమ పంట పొలాల్లో వండ్రు మట్టిని వేసుకొని భూములను సారవంతంగా చేసుకునేలా సహకరించని అధికారులు ఇటుక బట్టీలకు వండ్రు మట్టి తరలింపుకు అనుమతులు ఎలా ఇస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Also read: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇంటి వద్దకే వచ్చి పెన్షన్..?

దట్టమైన పొగ..

Advertisement

కాట్రేవుపల్లి గ్రామానికి వెళ్లే రహదారి ఇరువైపులా పదుల సంఖ్యలో వెలసిన ఇటుక బట్టీల ద్వారా వెలువడుతున్న మట్టి, దుమ్ము,ధూళి,బట్టీలను నుండి వెలువడుతున్న వేడి పంట పొలాలపై దాదాపు కిలోమీటర్ పరిధి వరకు వ్యాపిస్తున్నాయని, దీనివల్ల పంటలు సరిగ్గా పండగ పోవడం,సరైన దిగుబడి రాకపోవడం మాకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. దీంతో పాటు కాట్రేవుపల్లి, రాయికోడ్ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి ఇరువైపులా దాదాపు నాలుగు గ్రామాల ప్రజల పంట పొలాలు ఉన్నా రైతులు మా పంట పొలాలకు వెళ్లేటప్పుడు ఇటుకబట్టి నుంచి వెలువడే దుమ్ము ధూళి వేడి కారణంగా కనీసం ముందు వచ్చే వాహనాలు కూడా కనపడకుండా దట్టమైన పొగ కమ్ముకుని అనేకసార్లు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదంలో చాలామంది రైతులు కాళ్లు, చేతులు విరిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని భాదితులు తెలిపారు.

వర్షాకాలంలో దారుణం..

రుద్రసముద్రం గ్రామ చెరువులో నల్ల మట్టి తవ్వకాలు జరుపుతూ టిప్పర్ల లోడ్ వేసుకొని వెళ్తున్నా వాహనాల నుండి ఆ మట్టి రోడ్డుపై పడడం వల్ల వర్షాకాలంలోరైతులు తమ పొలాలకు కూడా వెళ్లలేని విధంగా రోడ్డు గుంతల మాయమై రైతులు తీసుకువెళ్లే ద్విచక్ర వాహనాలు జారిపడి అంగుళం కూడా ముందుకు వెళ్లలేని దుర్భరమైన పరిస్థితినీ సంవత్సరాల తరబడి భరిస్తూ వస్తున్నామని రైతులు ప్రజలు మొరపెట్టుకుంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా రాజకీయ నాయకులు ఒత్తిడిలో కారణం చేతనో అక్రమ వండ్రు మట్టి తరలింపు, ఇటుక పట్టిన తరలింపు పై అధికారుల చర్యలు కరువయ్యాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారుల ఆదేశాలను తుంగలో తొక్కి ఇటుక బట్టిలలో వేసినటువంటి వండ్రుమాటినే సీజ్ చేయాలని, వ్యవసాయ పంట పొలాలను నాశనం చేస్తున్న ఇటుక బట్టీల తరలింపుపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమాలు చేపడతామని రైతులు హెచ్చరిస్తున్నారు.

Also Read: ఓటరు జాబితా సవరణలో గందరగోళం..!

Related News

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

Big Stories

Advertisement
×