Kidney Stones: నేటి జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు శరీరంలో అనేక రకాల వ్యాధులకు కారణమవుతున్నాయి. వాటిలో కిడ్నీ స్టోన్ కూడా ఒకటి. మూత్ర పిండాల్లో రాళ్ల వల్ల కలిగే నొప్పిని తట్టుకోవడం చాలా కష్టం. కిడ్నీ స్టోన్ వల్ల వచ్చే నొప్పి కారణంగా.. రోజువారీ పని, జీవనశైలి ప్రభావితమవుతుంది.
కిడ్నీ స్టోన్స్ లైట్ తీసుకుంటే.. అది చాలా తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి వీలైనంత తొందరగానే సమస్య నుండి శాశ్వతంగా బయట పడాలి. ఇదిలా ఉంటే కిడ్నీ స్టోన్స్ ఉన్న వారు కొన్ని హోం రెమెడీస్ వాడవచ్చు. వీటిని పాటించడం ద్వారా మీరు ఎలాంటి మందులు లేదా ఆపరేషన్ లేకుండా మూత్రపిండాల్లో రాళ్లను వదిలించుకోవచ్చు.
కిడ్నీలో రాళ్లను తగ్గించే హోం రెమెడీస్:
నిమ్మరసం ,ఆలివ్ ఆయిల్:
నిమ్మరసం ,ఆలివ్ ఆయిల్ ద్వారా మూత్రపిండాల్లో రాళ్లను పూర్తిగా కరిగించవచ్చు. నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ కలిపిన మిశ్రమాన్ని తరచుగా తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ తగ్గుతాయి.
దానిమ్మ:
మూత్రపిండాల్లో రాళ్ల నివారణకు దానిమ్మపండు తినడం మంచిది.
దానిమ్మలో లభించే విటమిన్లు, ఐరన్ శరీరానికి చాలా మేలు చేస్తాయి. అంతే కాకుండా ఇది మూత్రపిండాల్లో రాళ్లను తొలగించడంలో సహాయపడే సహజ లక్షణాలను కలిగి ఉంటుంది. శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో కూడా సహాయపడుతుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్:
మూత్ర పిండాల్లో రాళ్లను తగ్గించడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది మూత్ర పిండాల లోని రాళ్లను చిన్న కణాలుగా విడగొడుతుంది. తద్వారా మూలం నుండి రాళ్లను తొలగిస్తుంది. కిడ్నీ రాళ్ల సమస్య నుండి బయటపడటానికి.. 2 టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్‌ను గోరు వెచ్చని నీటిలో కలిపి రోజూ త్రాగాలి.
గోధుమ గడ్డి:
మూత్రపిండాల్లో రాళ్లను తొలగించడంలో సహాయపడే గోధుమ గడ్డిలో అనేక పోషకాలు ఉంటాయి. వీట్‌గ్రాస్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మూత్ర నాళంలో పేరుకుపోయిన కాల్షియం , రాళ్లను తొలగించడంలో సహాయపడుతుంది. రాళ్లను కరిగించి మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి.. ప్రతిరోజూ గోధుమ గడ్డి నీటిని త్రాగాలి. దీనిని తయారు చేయడానికి.. గోధుమ గడ్డిని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. తర్వాత.. నీటిని వడకట్టి.. ఖాళీ కడుపుతో ప్రతిరోజూ తినండి.
Also Read: పాలలో.. ఏలకులు కలిపి తాగితే ?
బార్లీ వాటర్:
కిడ్నీ రాళ్ల నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందడంలో బార్లీ నీరు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బార్లీ నీటిలో అనేక మంచి లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఏర్పడిన రాళ్లను కరిగించి తొలగించడంలో సహాయపడుతుంది. దీంతో పాటు.. బార్లీ నీరు తీసుకోవడం వల్ల మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. బార్లీ వాటర్ తయారు చేయడానికి.. ఒక పాన్ లో ఒక గ్లాసు నీరు వేడి చేసి అందులో ఒక గుప్పెడు బార్లీ వేసి బాగా మరిగించాలి. తర్వాత.. ఈ నీటిని వడకట్టి చల్లార్చి తాగండి . ఇది రాళ్ల నొప్పి నుండి మీకు తక్షణ ఉపశమనం ఇస్తుంది.