E-Paper
Advertisement

TG Municipal Elections: కారు, కమలం దోస్తీ.. చెరో రెండున్నరేళ్లు పీఠంపై ఉండేలా ప్రతిపాదనలు..!

TG Municipal Elections: కారు, కమలం దోస్తీ.. చెరో రెండున్నరేళ్లు పీఠంపై ఉండేలా ప్రతిపాదనలు..!

TG Municipal Elections: స్వేఛ్చ బ్యూరో: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆ పీఠాలను దక్కించుకునేందుకు రాజకీయ చదరంగం మొదలైంది. ముఖ్యంగా హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి అడ్డుకట్ట వేసేందుకు బద్ధశత్రువులైన బీఆర్‌ఎస్,బీజేపీ(కారు – కమలం) చేతులు కలుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు పార్టీలకు మధ్య దోస్తీ దిశగా అడుగులు పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. అక్కడ హంగ్ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్‌ను అధికారానికి దూరం చేయడానికి బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు క్షేత్రస్థాయిలో ఒప్పందాలకు వస్తున్నట్లు తెలుస్తోంది. పలుచోట్ల ఈ రెండు పార్టీల నేతల మధ్య ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగినట్లు సమాచారం. మైత్రి కూడా కుదిరినట్లు తెలుస్తోంది.

ఐదేళ్ల పదవీ కాలంలో..

మున్సిపల్ పీఠం దక్కించుకోవడం కోసం గులాబీ, కమలం పార్టీలు ప్రధానంగా రెండు రకాల ఫార్ములాలపై చర్చిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐదేళ్ల పదవీ కాలంలో మొదటి రెండున్నరేండ్లు ఒక పార్టీ, మిగిలిన రెండున్నరేండ్లు మరో పార్టీ చైర్మన్ పీఠాన్ని పంచుకోవడంపై ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం. దీంతో పాటు మరో అంశం కూడా తెరపైకి వచ్చింది. ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీకి చైర్మన్ పదవి, మద్దతు ఇచ్చే రెండో పార్టీకి వైస్ చైర్మన్ పదవి ఇచ్చేలా చర్చలు జరిగినట్లుగా విశ్వసనీయ సమాచారం.

మరోవైపు క్యాంపు పాలిటిక్స్..

మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎన్నిక సోమవారం జరగనుంది. అలాగే గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం నేడు చేపట్టనున్నారు. ఈ నియామకం సందర్భంగా ఈ రహస్య ఒప్పందాలు బహిర్గతమవ్వనున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు, ఎక్స్-అఫీషియో ఓట్లు ఈ ఎన్నికల్లో అత్యంత కీలకం కానున్నాయి. రాష్ట్ర స్థాయిలో తీవ్రంగా విమర్శించుకునే ఈ రెండు పార్టీలు, స్థానిక సంస్థల్లో అధికారం కోసం ఒక్కటవుతున్నాయనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు క్యాంపు పాలిటిక్స్ కూడా కాషాయ పార్టీలో జోరుగా సాగుతోంది. కరీంనగర్ లో కార్పొరేషన్ స్థానం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటవుతున్నాయని కేంద్ర మంత్రి బండి స్పష్టంచేశారు. ఈనేపథ్యంలో ఆయన క్యాంపు పాలిటిక్స్ కు తెరతీసినట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ సైతం శామీర్ పేట్ లోని లియోనియో రిసార్ట్ కేంద్రంగా క్యాంప్ రాజకీయం కొనసాగిస్తుండటం గమనార్హం.

Also Read: Love Story OTT: అబ్బాయితో ప్రేమ… స్కూల్ అయిపోగానే బయట పడే అసలు రంగు… క్రేజీ వైరల్ స్టోరీ

వైస్ చైర్మన్ పదవి కమలం

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు జిన్నారం మున్సిపల్ చైర్మన్ పదవిని బీజేపీ మద్దతుతో బీఆర్ఎస్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. వైస్ చైర్మన్ పదవి కమలం పార్టీకి దక్కినట్లు సమాచారం. రెండు పార్టీల మధ్య మైత్రి కుదిరిందనేందుకు ఇది నిదర్శనంగా మారనుంది. ఇదిలా ఉండగా సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో ఎక్స్ అఫీషియో ఓటు కీలకంగా మారింది. స్థానికంగా బీజేపీకి ఒక్క కౌన్సిలర్ కూడా లేకపోయినా, ఎంపీ రఘునందన్ రావు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉండటం సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసింది. దీంతో ఈ సంఖ్యల ఆట మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఇదిలా ఉండగా బెల్లంపల్లిలో 34వ వార్డుకు చెందిన బీజేపీ అభ్యర్థి రామ్మూర్తి బీఆర్ఎస్ కు మద్దతిస్తానని చెప్పినట్లుగా సమాచారం. ఇప్పటికే కేటీఆర్ ను సైతం ఆయన కలిశారు.

కారు పార్టీతో మంతనాలు

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పొత్తు ఎవరికీ ఇవ్వబోమని, ఎవరి మద్దతు తీసుకోబోమని తొలుత కాషాయ పార్టీ నిర్ణయించింది. ఇటీవల రాంచందర్ రావు కూడా అదే చెప్పారు. కానీ బీఆర్ఎస్ మద్దతిస్తే ఆలోచిస్తామని, దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామనే వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఆ దిశగానే కారు పార్టీతో మంతనాలు జరపుతున్నట్లు సమాచారం. పార్టీలోనూ సమాలోచనలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే.. కారు, కమలం ఒక్కటేనన్న కాంగ్రెస్ విమర్శలకు బలం చేకూర్చేలా వ్యవహారం మారింది. మరి ఈ విమర్శలను కాషాయ పార్టీ ఎలా కట్టడి చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ కు ఎలా కౌంటర్ ఇస్తుందనేది వేచి చూడాలి. ఏది ఏమైనా మున్సిపల్ పీఠం కోసం జరుగుతున్న ఈ పోరులో వాస్తవాలకు నేటితో చెక్ పడనుంది. పూర్తి స్పష్టత రానుంది.

Also Read: T20 World Cup 2026: టీ20 ప్రపంచ క‌ప్ నుంచి పాకిస్తాన్ ఎలిమినేట్..? సూప‌ర్ 8లోకి టీమిండియా, USA !

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×