E-Paper
Advertisement

Vishwambhara: విశ్వంభర సినిమాపై అంచనాలు పెంచేసిన ప్రముఖ నిర్మాత!

Vishwambhara: విశ్వంభర సినిమాపై అంచనాలు పెంచేసిన ప్రముఖ నిర్మాత!

Vishwambhara:మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఏడు పదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సంక్రాంతికి వచ్చి ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న చిరంజీవి.. అటు ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన 24 గంటల్లోనే 200 మిలియన్ మినిట్స్ సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది. అలా తన సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న చిరంజీవి, ప్రస్తుతం బాబి డైరెక్షన్లో బెంగాల్ మాఫియా డాన్ గా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఒకవైపు అప్డేట్స్ వస్తున్న నేపథ్యంలో.. మరొకవైపు అందరిచూపు విశ్వంభర పైనే ఉంది.

విశ్వంభరపై అంచనాలు పెంచిన ధీరజ్..

గత ఏడాది విడుదల కావలసిన ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ విఎఫ్ఎక్స్ విమర్శలు ఎదుర్కొంది.. దీంతో ఈ సినిమాను ఎలాగైనా సరే అద్భుతంగా తీర్చిదిద్దాలని భావించిన చిత్ర బృందం సినిమాని రీ షూట్ చేయడం, సీజీ వర్క్ మరింత బెటర్ చేయడం కోసం వాయిదా వేస్తున్నారు. అందుకే ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి.. ఇప్పుడు జూలై 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. ఇకపోతే ఈ సినిమా టీజర్ విజువల్స్ చూశాక.. సినిమాపై పెద్దగా అంచనాలు ఏర్పడలేదు. కానీ నేడు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని చేసిన వ్యాఖ్యలతో విశ్వంభర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయని చెప్పవచ్చు.

మిమ్మల్ని విశ్వంభర వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తుంది – ధీరజ్

అసలు విషయంలోకి వెళ్తే.. ఫిబ్రవరి 14వ తేదీన సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా వచ్చిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా సక్సెస్ సాధించింది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా నిర్మాత ధీరజ్ మాట్లాడుతూ..” మొన్న నేను విశ్వంభర ట్రైలర్ చూశాను. అదిరిపోయింది. ఇప్పటివరకు మనం చూసిన సినిమా వేరు.. అసలు సినిమా పూర్తిగా వేరు. చాలా దాచి పెట్టారు. నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ట్రైలర్ చూడగానే నాకు హై ఫీల్ వచ్చేసింది. ఈ సంవత్సరం బైకర్, విశ్వంభర సినిమాలతో యువి క్రియేషన్స్ నెంబర్ వన్ బ్యానర్ గా నిలుస్తుంది” అంటూ అంచనాలు పెంచేశారు. ఇక అలాగే ఆయన మాట్లాడుతూ.. “విశ్వంభర సినిమాను నేను డిస్ట్రిబ్యూట్ చేయలేదు. దానికి నా స్థాయి సరిపోదు. నాలాంటి పదిమంది కలిసి ఆ చిత్రాన్ని మోయాలి”అంటూ తెలిపారు.. ఇకపోతే బిజినెస్ కూడా భారీగా అవుతోందని తెలిపారు ధీరజ్.

also read:Mrunal Thakur: రూమర్లే ఫ్రీ పబ్లిసిటీ.. ట్రోలర్స్ కి మరోసారి కౌంటర్!

ట్రైలర్ కోసం అభిమానుల ఎదురుచూపు..

ప్రస్తుతం ధీరజ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మెగా ఫాన్స్ విశ్వంభర సినిమాపై అంచనాలు పెట్టుకొని ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ట్రైలర్ వస్తే కానీ విశ్వంభర సినిమాపై క్లారిటీ రాదు అని చెప్పాలి.ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఆషికా రంగనాథ్, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, సురభి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి ఇప్పటివరకు విమర్శలు ఎదుర్కొన్న ఈ విశ్వంభర జూలై 9న ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Related News

థియేటర్ డోర్ వెనుక బాలీవుడ్ లవ్ బర్డ్స్ సీక్రెట్ ప్లాన్.. కెమెరామెన్స్ దెబ్బకు స్కెచ్ రివర్స్!

వివాదాల్లో పెద్ది…రామ్ చరణ్ సినిమాపై ఈ రేంజ్ నెగెటివిటీనా?

నెట్టింట వైరల్ అవుతున్న మృణాల్ ‘ఐస్‌క్రీమ్ రైస్’.. అంతలా అడిక్ట్ అయిపోయిందా?

అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

Big Stories

×