BigTV English
Advertisement

BRS Party: కారు ఖాళీ.. ప్రతిపక్షహోదా కూడా కష్టమే

BRS Party: కారు ఖాళీ.. ప్రతిపక్షహోదా కూడా కష్టమే

BRS Leaders Joining in Congress Party: నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు తయారైంది కేసీఆర్ పరిస్థితి. అధికారం ఉన్నపుడు ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఆయన తపన చివరికి ఆయన్నే మింగేసేలా తయారైంది. 2014 నుంచి ఇతర పార్టీల్లో గెలిచిన వారిని నయానో.. భయానో బీఆర్ఎస్‌లో చేర్చుకుంటూ వచ్చారు. 2018లోపు దాదాపు తెలంగాణలో టీడీపీ లేకుండా చేశారు. ఈ తర్వాత 2023లోపు కాంగ్రెస్ ను కూడా ఖతం చేయాలని చూశారు. దాదాపు ప్రజల్లో కూడా ఆ అభిప్రాయం క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అయితే.. రేవంత్ రెడ్డి చేతికి కాంగ్రెస్ పగ్గాలు వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించారు. ప్రజలు ఇచ్చిన ఓటమిని గౌరవించకుండా అవకాశం దొరికిన ప్రతిసారీ.. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. మరో 6 నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారని చెప్పడం మొదలు పెట్టారు. నిజానికి సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి ఇష్టపడలేదు. కానీ, ప్రభుత్వాన్నే కూల్చేస్తామంటే ఎవరికైనా తప్పదు.


అందుకే కాంగ్రెస్ తో కలిసి నడుస్తామని అంటున్నవారిని రేవంత్ రెడ్డికి కలుపుకొని పోతున్నారు. బీఆర్ఎస్ 40 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంటే.. పార్లమెంట్ ఎన్నికల ముందు ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ కూడా హస్తం కండువా కప్పుకున్నారు. పార్టీ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి మినహా అసెంబ్లీకి వచ్చింది లేదు. అయితే, ఇకపై వస్తానని ఆయన ప్రకటన చేశారు. కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టేసరికి ఆయనకు ప్రతిపక్షహోదా కూడా దక్కేలా కనిపించడం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ తో 20 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మిగిలిన వారికి బీజేపీ గాలం వేస్తుందని తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా తామే ఉండాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది.
ఏది ఏమైనా రోజులు లేదంటే కొన్ని నెలల్లో అసెంబ్లీలో బీజేపీ కంటే బీఆర్ఎస్‌ తక్కువ సంఖ్యా బలానికి పడిపోతుందని గులాబీ నేతలే చెబుతున్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో చాలా స్థానాల్లో డిపాజిట్లు కూడా రాకపోవడంతో ఇక బీఆర్ఎస్ కు భవిష్యత్ లేదని ఫిక్స్ అయ్యారట. అందుకే ఎవరి దారి వారు చూసుకుంటున్నారని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోవడం ఒక ఎత్తు అయితే.. ఓటమికి బీఆర్ఎస్ అధినేతే కారణమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఆయనే స్వయంగా ఓటు బ్యాంక్ సిఫ్ట్ చేశారనే వాళ్లు కూడా ఉన్నారు. దీంతో.. పార్టీకి భవిష్యత్ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే మెజారిటీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో మంతనాలు మంతనాలు జరుపుతున్నారు.


Also Read: ఢిల్లీ లిక్కర్ స్కామ్.. కవితకు దక్కని ఊరట, వచ్చేనెల 7వరకు..

వారంతా హస్తం గూటికి చేరే అవకాశం ఉంది. మిగిలిన వారు టైం చూసి బీజేపీలో చేరే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కేసీఆర్ ఫిరాయింపులను అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అధికారంలో ఉన్నపుడు పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా.. ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా.. ఇప్పుడు తలపట్టుకుంటే ప్రయోజనం ఏంటనే వారు కూడా ఉన్నారు. కనీసం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినపుడైనా.. ప్రజల్లో తిరిగితే బాగుండేదనే అభిప్రాయాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఓటమిని గౌరవిస్తున్నామని కూడా చెప్పకపోతే.. ప్రజలు ఆదరించరు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అసెంబ్లీకి వెళ్లకుండా, ఒక ప్రెస్ మీట్ పెట్టకుండా, ప్రజల్లోకి వెళ్లకుండా.. లోక్‌సభ ఎన్నికల సమయానికి బస్సు యాత్ర చేస్తే ప్రజలు ఎందుకు నమ్ముతారు? గెలుపు ఓటములు పక్కన పెడితే.. ప్రతిపక్షమే లేకుండా చేయాలనే ప్రయత్నం ఇపుడు బీఆర్ఎస్ పార్టీని నిలువునా దహించేస్తుంది. చూస్తుండగా పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నా.. ప్రశ్నించే సాహసం చేయలేని పరిస్థితి కేసీఆర్ కు ఎదురైంది. ఒకవేళ ప్రశ్నిస్తే.. ఆ ప్రశ్నలకు ముందు కేసీఆరే సమాధానం చెప్పాలి.

Tags

Related News

Mahesh Kumar Goud: బీజేపీ ఎక్కడ పోటీ చేసినా.. అక్కడ ఓట్ చోరీ పక్కా..

Bandi Sanjay: ఆలయాలు కూల్చేస్తారా? 48 గంటలు టైం ఇస్తున్నా.. బండి సంజయ్ సంచలనం

Revanth Reddy Birthday: అభిమాని బర్త్ డే గిఫ్ట్.. ట్యాంక్ బండ్ పై సీఎం రేవంత్ సైకత శిల్పం

Komatireddy Venkat Reddy: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 8 లైన్లకు విస్తరణ: మంత్రి కోమటిరెడ్డి

Hyderabad: శంషాబాద్‌‌లో విమానాల రాకపోకలు ఆలస్యం.. 200 మంది ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు

Flying Squad Raids: కాంగ్రెస్ నేత ఇంట్లో భారీగా నగదు..? జూబ్లీ హిల్స్‌లో ఈసీ రైడ్స్

CM Revanth Reddy: సీఎం రేవంత్ పుట్టినరోజు.. PM నుండి CM వరకు శుభాకాంక్షలు

Jubilee Hills By Elections: ఫైనల్‌ స్టేజ్‌కు జూబ్లీహిల్స్‌ బైపోల్‌ క్యాంపెయినింగ్‌.. రేపు సాయంత్రానికి ప్రచారం క్లోజ్‌

Big Stories

×