KCR Kavitha: ఒకప్పుడు తండ్రీకూతుర్లు ఎలా ఉండేవారు.. ఇప్పుడెలా ఉన్నారు? కీలక సమయాల్లో కేసీఆర్ వెంటే ఉండేవారు కవిత. ఇప్పుడు ఎదురుపడటానికి కూడా సాహసించ లేకపోతున్నారు. ఎవరో పరాయి వారిలా దూరంగా.. భయం భయంగా నిలబడిపోయారు. కేసీఆర్ సైతం ఆమె వైపు కన్నెత్తి కూడా చూడలేదు. తండ్రికి బొట్టు పెట్టలేదు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు హారతి కూడా ఇవ్వలేదు. అంటే.. దాని అర్థం ఏంటి? వారి బంధం బ్రేక్ అయినట్టేనా? కేసీఆర్, కవితల మధ్య దూరం పెరిగిపోయినట్టేనా? కవిత చేసిన పనికి కేసీఆర్ గుండె బద్దలైపోయిందా? కూతురిపై ప్రేమ చచ్చిపోయిందా? అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్ వస్తున్నాయి. కేసీఆర్, కవిత మధ్య గ్యాప్ వచ్చినట్టు తెలుస్తున్న ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. మరోవైపు, కవిత ఫాంహౌజ్‌కు వచ్చారనే విషయం తెలిసి కేటీఆర్ ఎర్రవల్లికి రాకుండా డుమ్మా కొట్టారని కూడా అంటున్నారు. అంటే, కల్వకుంట్ల ఫ్యామిలీ ముక్కలైపోయినట్టేనా?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరుకానున్నారు. ఆయన వెంట 9 మంది బీఆర్ఎస్(BRS) నేతలు వెళ్లనున్నారు. కేసీఆర్ వెంట వెళ్లే నేతల లిస్ట్‌లో కవిత పేరు లేదు. ఇవాళ ఉదయమే కవిత KCR ఫామ్‌హౌస్‌కు వెళ్లినా.. ఆమె పేరు లిస్ట్‌లో లేకపోవడంపై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. KCR, కవిత మధ్య గ్యాప్ అలాగే ఉందా? అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. ఇక కేసీఆర్(KCR) విచారణకు హాజరయ్యే BRK భవన్ ముందు.. కవిత సొంతంగానే బలప్రదర్శన చేయబోతోంది. BRK భవన్ దగ్గరికి జాగృతి కార్యకర్తలతో కలిసి రానుంది. కవిత. BRS శ్రేణులతో కలిసి కవిత ఎందుకు రావడం లేదు? BRS శ్రేణులతో కాకుండా జాగృతి కార్యకర్తలతోనే కవిత బీఆర్ఎస్ భవన్‌కు రావడానికి కారణాలేంటి? BRSకు కవితను దూరం పెట్టారా? బీఆర్ఎస్‌కు కవిత పూర్తిగా దూరమైనట్లేనా? అనే చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది.