E-Paper
Advertisement

BRS : ‘పాడి’కి అసమ్మతి!.. బీఆర్ఎస్‌కు ‘మేకు’లా మారారా?

BRS : ‘పాడి’కి అసమ్మతి!.. బీఆర్ఎస్‌కు ‘మేకు’లా మారారా?
Advertisement

padi ఏకంగా ఆయన సొంత నియోజకవర్గంలోని తన అనుచరులే ఆయన తీరు పట్ల తీవ్ర అసహనంతో ఉన్నట్టు చర్చ జరుగుతున్నది.పాడికౌశిక్ రెడ్డి తీరుతో పార్టీకి నష్టం వాటిల్లుతుందని, ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మనుగడ కష్టమని వారంతా ఓ నిర్ణయానికి రావడంతో పాటు అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఎమ్మెల్యే హైదరాబాద్‌లో ఉన్నసమయంలో వీరంతా ఓ వెంచర్లో రహస్యంగా సమావేశం అయినట్టు తెలిసింది. ఆ విషయం తెలుసుకున్న కౌశిక్ రెడ్డి వారికి కాల్ చేయగా..వారు సమాధానం ఇవ్వలేదని తెలుస్తున్నది.

నిత్యం వివాదాలు..

పాడికౌశిక్ రెడ్డి నిత్యం వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. తొలిసారి హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. పలుమార్లు మీడియాల్లో హైడ్‌లైన్ అయ్యే పనులు చేస్తూ వచ్చాడు. ముఖ్యమంత్రిని తిట్టడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇవ్వడం, ఇప్పుడు స్థానిక సీపీతో కయ్యం.. ఇలా పలుమార్లు ఆయన హౌస్ అరెస్టుతో పాటే కేసులు కూడా నమోదయ్యాయి. ఆయన వ్యవహారంపై గతంలోనూ సొంత పార్టీ నుంచే ఫిర్యాదులు వచ్చినట్టు తెలిసింది. పాడి వ్యవహారం నియోజకవర్గంలో ఆయనకే కాకుండా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీకి సైతం చెడ్డ పేరు వస్తుందని తోటి నియోజకవర్గ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుడు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

గెలిపించపోతే చస్తా..

Advertisement

గత సారత్రిక ఎన్నికల సమయంలో హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కౌశిక్ రెడ్డి.. ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని ఓ వీడియో రిలీజ్ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే ఆ వీడియో బయటకు రావడం, ఓటింగ్‌కు ముందు అలా చేయడం ఓటర్లను బ్లాక్ మెయిల్ చేయడం, తప్పుదారి పట్టించడం కిందకు వస్తుందని పలువురు ఈసీకి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.తీరా ఎన్నికల్లో గెలిచాక ఆయన నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం, బయటకు రావడం, మళ్లీ ఏదో ఒక కేసులో ఇరుక్కోవడం ఆయనకు పరిపాటిగా మారింది. ఈ మధ్యకాలంలో కమిషనర్‌ను మతం పేరుతో దూషించి ఐపీఎస్‌ల సంఘం ఆగ్రహానికి గురయ్యారు. మరల తప్పు తెలుసుకుని సదరు సీపీ, ఐపీఎస్‌ల సంఘానికి బహిరంగ క్షమాపణ చెప్పారు.

TG CM progress Report: అప్పుల ఊబి నుంచి గట్టెక్కేలా.. రేవంత్ రెడ్డి సరికొత్త ప్లాన్ ఇదే!

Advertisement

ఇదిలాఉండగా, పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం బీఆర్ఎస్ పార్టీలో కొరకరాని కొయ్యలా మారిందని సీనియర్లు పెదవి విరుస్తున్నట్టు తెలుస్తున్నది. ఆయన రౌడీకి ఎక్కువ.. ప్రజాప్రతినిధికి తక్కువ అన్న చందంగా ప్రవర్తిస్తున్నారని.. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి ఆయన తీరు వలన నష్టమే కానీ, ప్రయోజనం కలిగే అవకాశాలు కొంచెమైనా కనిపించడం లేదని పలువురు పార్టీలో చర్చించుకుంటున్నట్టు తెలుస్తున్నది.ఆయనకు క్రమశిక్షణా కింద నోటీసులు ఇవ్వాలని, పార్టీ లైన్‌కు కట్టుబడి నడుచుకోవాలని ఆదేశాలు ఇవ్వాలని పలువురు సీనియర్లు అధిష్టానాన్ని కోరినట్టు సమాచారం. అయినప్పటికీ, అధిష్టానం నుంచి ఆయనకు ఎటువంటి నోటీసులు వెళ్లలేదని తెలుస్తోంది. మొత్తానికి పాడి కౌశిక్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలవడం సంగతి అటుంచితే పార్టీకి మేకు దించడం గ్యారంటీని రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Related News

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Hyderabad: పైరవీలకు చెక్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ముఖ్యనేతలకు కీలక సూచనలు

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

Big Stories

Advertisement
×