BigTV English

Gudem Mahipal Reddy Joins Congress: బ్రేకింగ్ న్యూస్.. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Gudem Mahipal Reddy Joins Congress: బ్రేకింగ్ న్యూస్.. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

BRS MLA Gudem Mahipal Redy Joins Congress: బీఆర్ఎస్ పార్టీకి, మాజీ సీఎం కేసీఆర్ కు వరుసగా షాక్ లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగుతూ కాంగ్రెస్ బాటపడుతున్నారు. ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. తాజాగా మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హస్తం గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు పార్టీ కుండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈయన రాకతో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య పదికి చేరింది.


అయితే, పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారంటూ నిన్నటివరకూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. కాగా, వాటికి చెక్ పెడుతూ డైరెక్టుగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి.. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయనతోపాటు మరో బీఆర్ఎస్ నేత గాలి అనిల్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయన ఇటీవలే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేశారు.

Also Read: రైతురుణ మాఫీపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ఉత్తమ్‌


హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మహిపాల్ రెడ్డి, అనిల్ కుమార్ కు కాంగ్రెస్ కండువా కప్పి సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితోపాటు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పలువురు నేతలు కూడా హస్తం పార్టీలో చేరిపోయారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్ నుంచి కీలక నేతలు కాంగ్రెస్ లో చేరడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

మహిపాల్ రెడ్డి కంటే ముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. బీఆర్ఎస్ పార్టీని వీడి హస్తం గూటికి చేరుకున్నారు. వీరితోపాటు ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ కండువాను కప్పుకోవడం గమనార్హం.

ఈరోజుతో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరుకోగా, మరికొంతమంది ఎమ్మెల్యేలతో కూడా చర్చలు పూర్తయ్యాయని, వారు కూడా త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ నేతలే బహిరంగంగా ప్రకటన చేస్తున్న విషయం తెలిసిందే.

Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×