BigTV English

Viral Video: హిమాలయాలపై ఎలా ఉంటుందో మీకు తెలుసా.. వీడియో చూస్తే షాక్ అవుతారు..

Viral Video: హిమాలయాలపై ఎలా ఉంటుందో మీకు తెలుసా.. వీడియో చూస్తే షాక్ అవుతారు..

Viral Video: ప్రపంచంలోనే ఎత్తైన పర్వతంగా పేరు గాంచిన ఎవరెస్ట్ శిఖరం గురించి చిన్న వారి నుంచి పెద్ద వారి వరకు అందరికీ తెలుసు. హిమాలయాల్లోనే అత్యంత ఎత్తైన శిఖరంగా ఇది పేరుగాంచింది. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలని సంవత్సరానికి వేలలో పర్వాతారోహులు ప్రయత్నాలు చేస్తుంటారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి అరుదైన రికార్డులు సాధించాలని చూస్తుంటారు. ఇలాంటి తరుణంలో ఎన్నో ప్రమాదాలు ఎదురైనా కూడా వాటన్నింటిని ఎదుర్కుంటూ మరి శిఖరాన్ని అధిరోహించి రికార్డు సాధించిన వారి సంఖ్య చెప్పనక్కర్లేదు. అయితే హిమాలయాల గురించి చాలా వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.


హిమాలయాలు తరచూ మంచుతో కప్పబడి ఉంటాయి. అందువల్ల మంచును చూసి ఆస్వాదించాలని చాలా మంది కోరుకుంటుంటారు. ఇలా ప్రతీ ఏటా కొన్ని కోట్ల మంది హిమాలయ ప్రాంతాలకు పర్యటనకు వెళ్తుంటారు. అయితే హిమాలయాలను చూసి అక్కడి మంచుతో ఆడుకుంటూ ఎంజాయ్ చేయాలని అనుకునే వారు కొందరు ఉంటే కొంత మంది అంటే శాస్త్రవేత్తలు మాత్రం అసలు హిమాలయ పర్వతాలపై ఉండే ప్రాంతం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. మరోవైపు హిమాలయాలపై అన్ని చోట్లా తిరగడం అంటే కష్టం. కొన్ని చోట్ల చాలా ప్రమాదకరమైన ప్రాంతాలు ఉంటాయి. అందువల్ల కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తిరగడానికి వీలవుతుంది.

అయితే తాజాగా హిమాలయాలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిమాలయాలపైకి ఎక్కుతూ ఉంటే ఆక్సిజన్ తగ్గుతూ ఉంటుందని అంటారు. కనీసం ఊపిరి పీల్చుకోవడానికి అక్కడ వీలుకాదు. అయితే తాజాగా హిమాలయాలపై మనుషులు కూడా అడుగు పెట్టని చోటుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మావిక్ 2 ప్రో డ్రోన్‌ను ఉపయోగించి ఎవరెస్ట్ శిఖరంపై సముద్ర మట్టానికి 3,500 మీటర్ల ఎత్తులో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి చైనా శాస్త్రవేత్తలు ఈ వీడియోను తీశారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఎవరెస్ట్ ఎక్కుతున్న వారిని కూడా చూపించారు. ఎవరెస్టుపై మంచు, హిమానీ నదులు, కూడా కనిపిస్తాయి. ఈ వీడియో చూస్తే హిమాలయాలు ఎలా ఉంటాయో తెలుస్తుంది.


Related News

Delhi News: మహీంద్రా షోరూమ్‌.. థార్‌ ఎస్‌యూవీ ఒక్కసారిగా పల్టీలు, వైరల్ వీడియో

Gigi Hadid: కేవలం ఆ టేపు చుట్టుకుని నడిచినందుకు రూ.80 కోట్లు చెల్లించారట.. ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటీ?

Viral Video: మినీ బస్సులో సముద్రంలో షికారు.. ఒక్క భారీ కెరటంతో సీన్ మారిపోయింది!

Viral News: కొట్టేయడం నా హాబీ.. చోరీ కేసులో మహిళ సర్పంచ్ అరెస్ట్, ఆమె చెప్పింది వింటే ఫ్యూజులు ఔట్!

Viral Video: పరాయి మగాడితో అడ్డంగా దొరికిన భార్య.. తట్టుకోలేక భర్త..

Shocking: శిశువును ఫ్రీజర్ లో పెట్టి నిద్రపోయిన తల్లి.. వామ్మో ఇదేం ఘోరం?

×