Harishrao Meeting: సుప్రీంకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్‌కు ఊరట దక్కలేదు. ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌పై తక్షణం విచారణ చేపట్టేందుకు నిరాకరించింది న్యాయస్థానం. కేటీఆర్ పిటిషన్‌పై జనవరి 15న (బుధవారం) విచారణ చేపట్టనుంది ధర్మాసనం. న్యాయస్థానం సూచనతో కేటీఆర్ ఊరట లభించలేదు. కేటీఆర్ పిటిషన్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందుగా కేవియట్ దాఖలు చేసిన విషయం తెల్సిందే.
ఇదిలావుండగా తెలంగాణ భవన్‌లో హరీష్‌రావు పార్టీ సీనియర్ నేతలతో సమావేశ మయ్యారు. ఫార్ములా కేసులో ఏసీబీ విచారణను సమీక్షిస్తున్నారు హరీష్‌రావు. పార్టీ ఆఫీసులో ఉండి ఆయన మానిటరింగ్ చేస్తున్నారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, పలువురు బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు.
మరోవైపు ఇదే కేసులో ఈడీ ముందుకొచ్చారు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్. బషీర్ బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు నిధులు బదిలీపై ఆయనను ప్రశ్నిస్తోంది. విచారణ నేపథ్యంలో ఏసీబీ ఇచ్చిన ఆధారాలను ఈయన ఈడీకి ఇవ్వనున్నట్లు సమాచారం.
ఫార్ములా-ఈ రేస్ కేసులో ఈడీ విచారణకు హాజరైన IAS అధికారి అరవింద్ కుమార్
For More Updates Download The App Now –https://t.co/iPdcphBake pic.twitter.com/2ivIaeBeqz— ChotaNews App (@ChotaNewsApp) January 9, 2025