BigTV English

Harishrao Will join BJP- Rajagopal Reddy: బ్రేకింగ్ న్యూస్.. బీజేపీలోకి హరీశ్‌రావు..?

Harishrao Will join BJP- Rajagopal Reddy: బ్రేకింగ్ న్యూస్.. బీజేపీలోకి హరీశ్‌రావు..?

MLA Rajagopal Reddy Comments(Telangana politics): గత కొద్ది రోజులుగా తెలంగాణలో నేతలు పార్టీల మార్పులకు సంబంధించి చర్చలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజా రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే ఊహించని నేతలు సైతం ఇతర పార్టీలోకి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవలే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కారణాలు ఏవైనా కూడా పార్టీని వీడటంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతున్నది.


గతంలో కాంగ్రెస్ ను ఖాళీ చేసేందుకు ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు ఖాళీ అవుతుందా..? ఏందీ అని అనుకుంటున్నారు జనాలు. ఇంకొందరు నేతలేమో బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమంటున్నారు. ఇటీవలే జరిగిన పార్లమెంటు ఎన్నికల సమయంలో కూడా బీఆర్ఎస్ నేతలు.. అది కూడా పేరు మోసిన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్, బీజేపీ పార్టీలోకి వెళ్లారు. అప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది.

ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇప్పటికీ పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. తాజాగా ప్రకాశ్ గౌడ్ కూడా జాయిన్ అవుతనంటూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరో అంశం తెరమీదకు వస్తోంది. సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది.


Rajagopal Reddy
Rajagopal Reddy

ఈ అంశంపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుందని చెప్పారు. హరీశ్ రావు కూడా పార్టీని వీడబోతున్నారని, బీజేపీలోకి వెళ్లబోతున్నారంటూ ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమంటూ ఆయన అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ పై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. అందువల్ల కేసీఆర్ రాజకీయాలను వదిలేసి ఇంట్లోనే ఉంటే బెటర్ అని ఆయన సలహా ఇచ్చారు.

కాగా, చాలా సందర్భాల్లో హరీశ్ రావు పార్టీ మారబోతున్నారంటూ పలువురు నేతలు పేర్కొన్న సందర్భంలో ఆయన స్పందించారు. ఆ నేతల వ్యాఖ్యలను ఖండించారు. తాను బ్రతికున్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని తేల్చిచెప్పారు. పార్టీని విడాల్సి వస్తే తాను రాజకీయాల నుంతి శాశ్వతంగా తప్పుకుంటానంటూ చెప్పుకొచ్చారు. అయితే, రాజగోపాల్ రెడ్డి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంతో భారీగా చర్చ కొనసాగుతుంది. హరీశ్ రావు నిజంగానే పార్టీ మారుతున్నారా..? అంటూ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

Also Read: పార్టీలోకి వస్తా అంటే ఎవరైనా వద్దంటారా..? : మంత్రి శ్రీధర్ బాబు

చూడాలి మరి రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టు హరీశ్ రావు పార్టీ మారబోతున్నారా లేదా అనేది. ఎందుకంటే.. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇదే మాదిరిగా పార్టీని మారబోం.. రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ లోనే ఉంటామని ఇవాళ చెప్పి.. రేపు మరో పార్టీలో చేరిపోయారు. ఈ పరిస్థితులను పరిశీలించిన ప్రజలు.. హరీశ్ రావు కూడా పార్టీ మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు.

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×