BigTV English

BRS Mla Kadiyam joining in Congress: కారులో ఉక్కపోత.. హస్తం గూటికి కడియం.. ఆ తర్వాత

BRS Mla Kadiyam joining in Congress: కారులో ఉక్కపోత.. హస్తం గూటికి కడియం.. ఆ తర్వాత
BRS Mla Kadiyam joining in Congress:
BRS Mla Kadiyam joining in Congress:

BRS Mla Kadiyam joining in Congress: తెలంగాణలోని బీఆర్ఎస్ నుంచి వలసలు కంటిన్యూ అవుతున్నాయి. రోజుకో నేత అధికార కాంగ్రెస్‌లోకి చేరిపోతున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువాను కప్పుకున్నారు. కడియం శ్రీహరితోపాటు ఆయన కూతురు కావ్య కూడా ఉన్నారు.


రీసెంట్‌గా కావ్యకు బీఆర్ఎస్ నుంచి వరంగల్ లోక్‌సభ టికెట్ ఇచ్చింది. అయితే తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీ కష్టమనే భావనకు వచ్చేశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఈ విషయమై కాంగ్రెస్ పెద్దలతో పలుమార్లు మంతనాలు జరిపారు. అటు స్టేషన్ ఘన్‌పూర్ వెళ్లి కార్యకర్తలతో పలుమార్లు భేటీ అయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ మారడం తప్ప మరో ఛాన్స్ లేదని చెప్పడంతో కార్యకర్తలు ఆయన మద్దతు ఇచ్చారు.

ఆదివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు ఎమ్మెల్యే కడియం. దీంతో బీఆర్‌ఎస్ కీలక నేతలంతా దాదాపుగా కాంగ్రెస్‌లోకి వచ్చేశారు. మహా అంటే ముగ్గురు లేదా నలుగురు నేతలు ఆ పార్టీలో ఉండవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే రాజ్యసభ ఎంపీ కే. కేశవరావు, ఆయన కూతురు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ గూటికి చేరిపోయారు.


Related News

Ganesha immersion: గణేష్ నిమజ్జనం.. ఈ మార్గాల్లో అసలు వెళ్లొద్దు.. క్లియర్ కట్ వివరాలు ఇదిగో

CM Revanth Reddy: కేసీఆర్ పాపాలు బయటకు వస్తాయనే.. వీఆర్వో, వీఆర్ఏలను తొలగించాడు: సీఎం రేవంత్

Mahabubabad News: యూరియా లొల్లి.. నడిరోడ్డుపై ఇద్దరు మహిళలు పొట్టుపొట్టు కొట్టుకున్నారు, వీడియో వైరల్

GHMC: వరదకు చెక్ పెట్టేందుకు రోబోట్లను రంగంలోకి దింపిన జీహెచ్ఎంసీ.. ఇవి ఎలా పనిచేస్తాయంటే?

Karimnagar News: కరీంనగర్‌లో బుర్ఖా డ్రామా.. మెడికల్ కాలేజీలో కలకలం!

Hyderabad Metro: హైదరాబాదీలకు భారీ గుడ్ న్యూస్.. ఆ రోజు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సేవలు

Big Stories

×