BigTV English

Heat Waves : తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. నేడు, రేపు వడగాల్పులు..

Heat Waves : తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. నేడు, రేపు వడగాల్పులు..
Heat Waves
Heat Waves

Heat Waves In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో  తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.


ఏపీలో ఆదివారం 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.  సోమవారం 64 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

ఏపీలో చాలా ప్రాంతాల్లో వారంరోజులుగా 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అనంతపురం, కడప, తిరుపతి, చిత్తూరు, గుంటూరు, నంద్యాల జిల్లాల్లో సరాసరి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.


Also Read: రోడ్లపై జ్యూస్‌లు తాగుతున్నారా.. అయితే ఆ ప్రమాదం ఉన్నట్లే!

తెలంగాణలోనూ ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంది. పగటి ఉష్ట్రోగతలు భారీగా పెరిగాయి. భానుడి భగభగలకు జనం అల్లాడుతున్నారు. మధ్నాహ్నం వేళ రోడ్లపైకి వచ్చేందుకు భయపడుతున్నారు. చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్టోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి.

ఎండలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని వైద్యు నిపుణులు సూచిస్తున్నారు. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలంటున్నారు. వృద్ధులు, చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెబుతున్నారు. వారిని అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు పంపవద్దని సూచిస్తున్నారు. ఎండల్లో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు.

Related News

AP Govt Schemes: ఏపీకి స్పెషల్ అవార్డు.. దీని వెనుక అసలు కథ ఇదే!

Chandra Grahanam 2025: సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం.. శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచన..!

Turakapalem mystery: ఆ ఊరికేమైంది? 20 మరణాల మిస్టరీ ఏమిటి? రంగంలోకి సీఎం..!

Chandrababu: చంద్రబాబుకి అమరావతికంటే ఇష్టమైన ప్రదేశం ఏంటి?

AP Assembly 2025: 18 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. జగన్ వచ్చేనా?

AP Fact Check: సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు హెలికాప్టర్ హంగామా… వాస్తవం ఏంటో తెలుసా?

Big Stories

×