BigTV English

Trending : ఈయన ఎవరో గుర్తు పట్టారా? మన మా మా మాస్..

Trending : ఈయన ఎవరో గుర్తు పట్టారా? మన మా మా మాస్..

Trending : చెప్పుకోండి చూద్దాం ఈయన ఎవరో? గుర్తు పట్టారా? ఆ డ్రెస్‌లో కాస్త కష్టంగా ఉందా? కాస్త జాగ్రత్తగా చూడండి.. ఆ అద్దాలు తీసేసి ఆయన ఫేస్‌ను ఊహించుకోండి.. ఆ పక్కన ఉన్నావిడను చూడకుండా అతన్నే చూడండి.. ఆ..ఆ.. గుర్తుకొచ్చిందా? లేదంటే ఆ వెరైటీ డిజైన్ డ్రెస్‌లో కాకుండా వైట్ షర్ట్‌లో ఉండే పొలిటీషియన్‌ను ఇమాజినేషన్ చేసుకోండి.. ఆ థంప్స్‌అప్ సింబల్.. ఆ స్మైల్.. ఆ ఆయననే… మన మా మా మాస్ లీడర్.


పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడ్డా.. వ్యాపారం చేశా.. పైకొచ్చా.. ఎమ్మెల్యేనయ్యా.. మంత్రినయ్యా.. ఆయనే ఈయన. మన మల్లన్న. బీఆర్ఎస్ లీడర్. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. మరి, ఈ డ్రెస్ ఏంది? ఈ అవతారం ఏంది? అనుకుంటున్నారా..

ట్రెండ్ సెట్టర్ మల్లన్న


మల్లన్న ఏం చేసినా అది ట్రెండింగే. 70 ఏళ్ల ఏజ్‌లోనూ యంగ్ లీడర్ మాదిరి హుషారుగా ఉంటారు. డ్యాన్సులు చేస్తారు. డైలాగులు కొడతారు. జోకులు చేస్తారు. పక్కా హైదరాబాదీ తెలంగాణ యాసలో మంచి మంచి ముచ్చట్లు చెబుతారు. మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలతో కోట్లు సంపాదించారు. రియల్ ఎస్టేట్ చేసి తరలాకు తరగని ఆస్తులు వెనకేసుకున్నారు. ఆయనపై భూకబ్జాలు, కాలేజీల్లో అక్రమాలు తదితర అనేక కేసులు, వివాదాలు కూడా ఉన్నాయి. కాలేజీ ఓనర్ అయినా కూడా.. స్టూడెంట్‌లానే సందడి చేస్తుంటారు. ఎవ్రీ ఇయర్ కాలేజ్ డే ఫంక్షన్‌లో మల్లారెడ్డిదే ధూంధాం అంతా. మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో అక్రమాలపై ఈడీ రైడ్స్ జరిగినప్పుడు కూడా ఆయన ఏమాత్రం డల్ కాలేదు. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ అదే జోరు. అంతకుమించి హుషారు. MAD.

Also Read : తెలంగాణలో భూకంప కేంద్రం.. ఎప్పుడైనా పేలొచ్చు..

జపాన్‌లో జిల్ జిల్ జిగా..

ఇక, మల్లారెడ్డి లేటెస్ట్ గెటప్ ఇక్కడిది కాదు. ఫారిన్ టూర్‌లో ఉన్నారు ప్రస్తుతం ఆయన. ఈమధ్యే ఫ్యామిలీతో కలిసి జపాన్ పర్యటనకు వెళ్లారు. అక్కడి బుల్లెట్ ట్రైన్‌లో తిరిగి తెగ ఎంజాయ్ చేశారు. అట్నే, జపాన్ సైట్ సీయింగ్‌కు ఇలా సంప్రదాయ జపనీస్ దుస్తులు ధరించి వెళ్లారు. లాంగ్ కోట్ తరహా డ్రెస్ అక్కడి ట్రెడిషన్. లేడీస్ సైతం అలాంటి ఫుల్ లెన్త్ డ్రెస్సే వేసుకుంటారు. అందుకే, మల్లారెడ్డి దంపతులు ఇద్దరూ ఇలా జపాన్ స్పెషల్ జిగ్‌జాగ్ డ్రెస్సులు వేసుకుని.. జిల్ జిల్ జిగా అంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అదిప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఎంతైనా మల్లన్నా.. మజాకా.

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×