Earthquake prediction: సమయం, సందర్భం వచ్చినప్పుడు తెలంగాణకు భూకంపం ప్రభావం పెద్దగా లేదని, ఈ ప్రాంతం ఆ జోన్‌లో లేదని చెబుతుంటారు శాస్త్రవేత్తలు. ఒకవేళ వచ్చిన లైట్‌గా ఉంటుందని చెప్పిన సందర్భాలు లేకపోలేదు. కొద్ది రోజుల్లో తెలంగాణ భూకంపాన్ని ఎదుర్కోబోతోందన్న వార్త తెగ హంగామా చేస్తోంది. దీని ప్రభావం రామగుండంలో ఉంటుందని ఎర్త్ క్వేక్ రీసెర్చ్ ఎనాలిసిస్ సంస్థ తెలిపింది.
అసలు కథ
రామగుండం గోదావరి ఖని కేంద్రంగా భూకంపం రానుంని ఎర్త్‌క్వేక్ రీసెర్చ్ అనాలిసిస్ సెంటర్ సంస్థ అంచనా వేసింది. ఈ మేరకు ఎక్స్‌లో ఈ విషయాన్ని రాసుకొచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5 తీవ్రతతో ఉండే అవకాశముందని తెలిపింది. దీని ప్రభావం వరంగల్, హైదరాబాద్, అమరావతి, మహారాష్ట్ర వరకు ఉంటుందని పేర్కొంది.
తెలంగాణలోని సింగరేణి ప్రాంతం భూకంపాలు వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు అప్పుడప్పుడు చెబుతున్నాయి. రామగుండం, గోదావరి ఖని సంభావ్యత ఎక్కువుగా ఉన్న ప్రాంతాలు కావడమే దీనికి కారణమని అంటున్నారు. త్వరలో ఓ భూకంపం రావచ్చని ఎపిక్ సంస్ అంచనా వేసింది.
కొంతమంది భూకంప అధ్యయన ఔత్సాహికులు ఈ సంస్థను నిర్వహిస్తున్నారు. అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించి మందస్తు అంచనాలు చెబుతారు. వాళ్లిచ్చిన ప్రాంతం రామగుండం సమీపంలోని కాసి పేట వద్ద ఉంది. దీంతో తెలంగాణ, ఏపీ ప్రజల్లో ఆందోళన మొదలైంది.
ALSO READ: సలేశ్వరం జాతర మొదలు.. వెయ్యి అడుగుల లోయలో లింగమయ్య
శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?
ఇది నాణెనికి ఒకవైపు మాత్రమే.. రెండో వైపు వస్తే.. తెలంగాణలో భూకంపం అంచనాలు నకిలీవని అంటున్నారు నిపుణులు. భూకంపాలను అంచనా వేయడానికి ఎలాంటి సాంకేతికత లేదన్నది వారి మాట. తెలంగాణలోని రామగుండం సమీపంలో భూకంపం సంభవిస్తుందని వార్తను హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-NGRI శాస్త్రవేత్తలు తోసిపుచ్చారు.
భూకంపం వచ్చే సమయం, స్థానం ముందుగా అంచనా వేయగల శాస్త్రీయ పద్ధతి అందుబాటులో రాలేదన్నారు. తప్పుడు సమాచారంతో ప్రజలు ఆందోళనకు గురి కావద్దని అంటున్నారు. ఎపిక్ పోస్టుకు ఎక్స్ నుంచి అధికారిక ఆమోద ముద్ర లేదన్నారు. ఇలాంటి భయాందోళనలను వ్యాప్తి చేయడం మానుకోవాలని సూచన చేస్తున్నారు.
దేశంలో భూకంపాల పరంగా అత్యంత సురక్షితమైన జోన్‌లో తెలంగాణ ఉందని అంటున్నారు. ఈ ప్రాంతానికి ఎలాంటి టెక్టోనిక్ సరిహద్దుకు దగ్గరగా లేదన్నారు. ఇక్కడ భూకంపాలు చాలా తక్కువగా ఉంటాయని వివరించారు. ఒకవేళ రామగుండంలో భూకంపం సంభవించినప్పటికీ దాని ప్రభావం హైదరాబాద్‌పై ఏ మాత్రం పడే ఛాన్స్ ఉండదని అంటున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో అప్పుడప్పుడు భూప్రకంపనలు వచ్చాయి. అవేమీ పెద్ద నష్టాన్ని కలిగించలేదు. 1969లో ఒంగోలులో 5.1 తీవ్రతతో భూకంపం నమోదైంది. 1998లో ఆదిలాబాద్‌లో 4.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. 1984, 1999, 2013లో హైదరాబాద్‌లో స్వల్ప భూప్రకంపనలు నమోదయ్యాయి. అవన్నీ తీవ్రత తక్కువగా వచ్చాయని గుర్తు చేస్తున్నారు.
ఒకవేళ భూకంపాల గురించి NGRI, IMD వంటి శాస్త్రీయ సంస్థలు కచ్చితమైన సమాచారాన్ని ఇస్తాయని గుర్తు చేస్తున్నారు కొందరు శాస్త్రవేత్తలు. దేశంలో భూకంప జోన్లు ఒకటి నుంచి ఐదు వరకు ఉన్నాయి. అందులో జోన్-5 వచ్చే భూకంపాలు తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ భూమి కంపిస్తే అంతులేని నష్టం ఉంటుంది. మొత్తానికి నిజం తెలుసుకునే లోపు అబద్దం గుమ్మం దాటి పోవడమంటే ఇదేనేమో!
As per our research & analysis #upcoming significant #earthquake possible near #Ramagundam #Telangana south #India #tremors may reach up to near #Hyderabad #Warangal #Amaravathi #AndhraPradesh #Maharashtra
~18.73°N 79.62°E
~10-17 April 2025
~5 #Magnitude pic.twitter.com/COhmgcHcnq— Epic ( Earthquake Research & Analysis ) (@epic_earthquake) April 9, 2025