Assembly Adjourned: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికి వాయిదా పడింది. కులగణన, ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సమావేశం జరుగుతోందని సభను వాయిదా వేయాలని స్పీకర్‌ను శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. దీంతో సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అటు మండలి సైతం వాయిదా పడింది.
శాసనసభ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలో వాయిదా పడడంపై కాసింత అసహనం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇది ఆశ్చర్యకరంగా ఉందన్నారు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి. చరిత్రలో ఇలా జరగలేదన్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమని చెప్పారని అన్నారు. స్టిల్ ఇప్పటికీ కేబినెట్ సమావేశం ఇంకా పూర్తి కాలేదని మంత్రి చెప్పారు.
దీనిపై మీడియా పాయింట్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి.. అసలు ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నారా? అంటూ ప్రశ్నలు సంధించారు. మంత్రివర్గ సమావేశం ఎనిమిది గంటలకు పెట్టుకుంటే బాగుండేదన్నారు. బీసీ, ఎస్సీల పై ప్రభుత్వానికి ఏమైనా గౌరవం ఉందా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మరో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నోరు విప్పారు. రథసప్తమి రోజు దేవాలయాలకు సభ్యులు వెళ్లకుండా సభ పెట్టారని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ ఆమోదం లేకుండా ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. అపాయింట్‌మెంట్ తర్వాత జీవో ఇవ్వాలని, కానీ ఇదెక్కడి ప్రొసీజర్ అని మండిపడ్డారు. అన్ని కులసంఘాలతో చర్చ చేయాలన్నారు. శాస్త్రీయంగా సర్వే జరగాలన్నారు.
ALSO READ: పుకార్లకు బ్రేక్.. చిట్ చాట్ టైమ్.. నేతల మనసులో మాట
తెలంగాణ సమాజంలో వెనుకబడ్డ తరగతులు మాకు న్యాయం జరగబోతోందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అన్నారు మరో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. సర్వే పట్ల బీసీ నేతలు, విశ్లేషకులు విమర్శలను గుర్తు చేశారు. మంత్రి వాయిదా కోరగానే స్పీకర్ వాయిదా వేయడం సరికాదన్నారు.
సోమవారం లేదా మంగళవారం ఉదయం కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తే బాగుండేదన్నారు. ప్రత్యేక సమావేశాన్ని మరో నాలుగు రోజులు పొడిగిస్తే బాగుండేదని మనసులోని మాట బయటపెట్టారు. మరోవైపు శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్‌గా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, శాసనసభలో పార్టీ విప్‌గా కెపి వివేకానంద నియామకం జరిగింది.
కేబినెట్ సమావేశం జరుగుతుండడంతో అసెంబ్లీని
వాయిదా వేయాలని కోరిన మంత్రి శ్రీధర్ బాబుఅసెంబ్లీని మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసిన స్పీకర్ https://t.co/x7og4gvYfy pic.twitter.com/quEtWCPR03
— BIG TV Breaking News (@bigtvtelugu) February 4, 2025