Chit Chat Time: తెలంగాణలో జరిగిన సమగ్ర కులగణన సర్వేపై మనసులోని మాట బయటపెట్టారు మంత్రి పొన్నం ప్రభాకర్. తాము చేపట్టిన సర్వే 100 శాతం నిస్పాక్షికంగా జరిగిందన్నారు. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో దాదాపు 100 కు వంద శాతం సర్వే చేపట్టామన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కావాలని కొంతమంది సర్వేకు దూరంగా ఉన్నారని గుర్తు చేశారు.
గ్రేటర్ సిటీలో కావాలని సర్వే అధికారులపై మరికొందరు కుక్కలు వదిలిన విషయాన్ని గుర్తు చేశారు సదరు మంత్రి. కుల గణన సర్వేపై ఎలాంటి అపోహలు వద్దని వెల్లడించారు. ప్రభుత్వంలో వ్యక్తిగా మాకు ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలు లేవన్నారు. బీసీల గురించి ఎవరైనా మాట్లాడితే చులకన అవుతారన్నారు. బీసీలకు అన్యాయం చేసే ఆలోచన మా ప్రభుత్వానికి ఏ మాత్రం లేదన్నారు. ఈ విషయంలో మా ప్రభుత్వం ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేస్తుందని వెల్లడించారు.
అధికారుల తీరుపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. వచ్చిన తర్వాత వాటిపై తప్పకుండా స్పందిస్తానని చిట్ చాట్‌లో చెప్పుకొచ్చారు. అధికారుల విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. అలాగని కాంప్రమైస్ కాలేదు.. అయ్యేది లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైఎస్ఆర్ పాలనలో అధికారుల విషయంలో తాను కాంప్రమైస్ కాలేదని, కావాలంటే జైలుకు పోతానన్నారు ఎమ్మెల్యే దానం. తనపై 173 కేసులు ఉన్నాయిని గుర్తు చేశారు. పేదల ఇళ్లు కుల్చుతామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదన్నారు. హైడ్రా విషయంలో కూడా వెనక్కి తగ్గేది లేదన్నారు.
ALSO READ: బీఆర్ఎస్ కీలక నిర్ణయం.. ఎందుకు అలాంటి నిర్ణయం.. డీల్ కుదిరిందా? సైకిల్ దారిలో కారు
తన ఇంట్లో ఇప్పటికీ వైఎస్ఆర్, కేసీఆర్ ఫోటోలు ఉంటాయన్న విషయాన్ని తెలిపారు. ఇంట్లో లీడర్ల ఫోటోలు ఉంటే తప్పేంటి? ఈ విషయంలో ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుందన్నారు.
మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చిట్‌చాట్‌లో కీలక విషయాలు బయటపెట్టారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు వారి కులాల గురించి మాట్లాడే హక్కు ఉందన్నారు. ఇతర కులాలను తిట్టే హక్కు ఆయనకు లేదన్నారు. పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం సరైన పద్దతి కాదన్నారు. తీన్మార్ మల్లన్న గెలుపు కోసం తాను ఫ్యామిలీ సభ్యులు అంతా పని చేస్తామన్నారు.
గెలుపు కోసం రాజేందర్ రెడ్డి పని చేశారని పార్టీకి మల్లన్న నివేదిక ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అనిరుద్ రెడ్డి తనకు ఫోన్ చేసిన మాట వాస్తవమేనని, కానీ తాను వెళ్లలేదన్నారు. మా నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి చాలా నిధులు ఇచ్చారన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి లంచ్ చేస్తే తప్పేంటని అన్నారు. మా పార్టీ వాళ్లకు లేని ఇబ్బంది బయటి పార్టీలకు ఇలాంటి నొప్పి ఎందుకన్నారు.