BRS MLC Kalvakuntla Kavita Join in Hospital: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనారోగ్యానికి గురయ్యారు. ఈ మేరకు ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. మంగళవారం ఉదయం అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే హుటాహుటినా ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
ఈ మేరకు కవితకు సాయంత్రం వరకు పలు రకాల వైద్య పరీక్షలు చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఇదిలా ఉండగా, తీహార్ జైలులో ఉన్న సమయంలో ఎమ్మెల్సీ కవిత అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆమె గత కొంతకాలంగా గైనిక్ సమస్యలు, అధిక జ్వరంతో పాటు వివిధ రకాలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాగా, కవిత గతంలోనే ఢిల్లీలోని ఎయిమ్స్ లోనూ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో భాగంగానే మరోసారి టెస్టులు చేయించుకొని ఏదైనా సమస్య ఉంటే ట్రీట్ మెంట్ తీసుకుంటారని తెలుస్తోంది.