Hyderabad News: హైదరాబాద్‌లోని పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో గోడౌన్‌తోపాటు వాహనాలు దగ్దమయ్యాయి. క్రాకర్స్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. అసలు ఏమైంది?
పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం
దీపావళి వేళ హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బహదూర్ పురా చౌరస్తా వద్ద ఓ స్క్రాప్ గోదాంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే కామాటిపుర పోలీసులు-బహదూర్‌పుర పోలీసులు-డిఆర్‌ఎఫ్ బృందాలు, అగ్నిమాపక దళ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
మూడు ఫైర్ ఇంజెన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపు గోదాంలోని స్క్రాప్ సామగ్రి దగ్దమయ్యింది. సమీపంలోని ఓ జీపు, కారు పూర్తిగా బూడిదయ్యాయి. ప్రాణనష్టం లేకపోయినా, ఆస్తినష్టం భారీగా జరిగిందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పాతబస్తీ పోలీసులు. క్రాకర్స్ వల్లే ఈ ఘటన జరిగిందని అంటున్నారు స్థానికులు.
క్రాకర్స్ ఎఫెక్ట్.. తగలబడిన స్క్రాప్ గోదాం
రాత్రంతా నిద్రలేకుండా గడిపామని స్థానికులు చెబుతున్నారు. దాదాపు తెల్లవారుజామున రెండు గంటల వరకు ఆ ప్రాంతంలో క్రాకర్స్ పేల్చినట్టు చెబుతున్నారు. ఆర్‌కే టవర్ పక్కనే చెక్క క్యాబినెట్‌లు, ఇతర స్క్రాప్ మెటీరియల్‌లను నిల్వ చేస్తున్న గోడౌన్‌లు ఉన్నాయి. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడం వల్ల నిప్పురవ్వలు లోపల నిల్వ ఉంచిన చెక్క వస్తువులపై పడి మంటలు వేగంగా వ్యాపించాయని చెబుతున్నారు.
ALSO READ: సీఎం రేవంత్ తో కొండా దంపతుల భేటీ, సమస్యకు ఫుల్‌స్టాప్
ఈ ఘటన తర్వాత ఆర్కే టవర్ ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అధికారులు సమీప ప్రాంతాల వారిని ఖాళీ చేయించారు. ప్రమాదాన్ని నివారించడానికి విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు.
గురుగ్రామ్‌లో భారీ అగ్నిప్రమాదం
మరోవైపు హర్యానాలోని గురుగ్రామ్‌లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురుగ్రామ్‌లోని ఓ షోరూమ్‌లో ఈ ఘటన జరిగింది. రెండున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు షాపు ఓనర్ చెబుతున్నాడు. ఓనర్ అక్కడికి చేరుకునేటప్పటికీ షాపు పూర్తిగా కాలిపోయింది. చెక్క పదార్థాలు మంటలు వేగంగా వ్యాపించడానికి కారణమయ్యాయని చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపకసిబ్బంది రంగంలోకి దిగారు. చివరకు మంటలు అదుపు చేశారు. ప్రాణం నష్టం లేదని, ఆస్తి నష్టం అంచనా వేయాల్సివుంటుందని తెలిపారు.
#WATCH | Haryana: A massive fire broke out at a showroom in Gurugram, efforts underway to douse the fire. pic.twitter.com/YAuvk1EPfe
— ANI (@ANI) October 20, 2025