E-Paper
Advertisement

Errabelli Dayakar Rao: కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం సరికాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం‌పై ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్!

Errabelli Dayakar Rao: కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం సరికాదు..  కాంగ్రెస్ ప్రభుత్వం‌పై  ఎర్రబెల్లి  దయాకర్ రావు ఫైర్!
Advertisement

Errabelli Dayakar Rao: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తొర్రూరు పట్టణంలోని 13, 14 వార్డుల్లో ఉదయం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ (BRS)  మాజీ మంత్రి, ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) అనంతరం రాయపర్తి మండల కేంద్రంలో కేసీఆర్‌కు జారీ చేసిన సిట్ నోటీసులకు వ్యతిరేకంగా జాతీయ రహదారిపై బైఠాయించి భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ (Brs)  శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తొర్రూరు పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

తెలంగాణ కోసం ఉద్యమం చేసిన నాయకుడు కేసీఆర్

ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన నాయకుడు కేసీఆర్అ (KCR) ని, అలాంటి నాయకుడిపై సిట్ నోటీసుల పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరాచక చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఒక పెద్దమనిషిని హింసించడం ప్రజాస్వామ్య విరుద్ధమని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తొర్రూరు లోనే కేసులు పెట్టడం వెనుక రాజకీయ కక్ష ఉందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మోసపూరిత హామీలు, బొకరు మాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు.

Advertisement

Also Read: Errabelli Dayakar Rao Atrocities: బయటపడ్డ మాజీ మంత్రి ఎర్రబెల్లి దౌర్జన్యాలు, అరాచకాలు..!

రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో భూమి రేట్లు, రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందని, దానికి కారణం రేవంత్ రెడ్డేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాన్ని ప్రజలు ఇప్పటికే గుర్తించారని, అందుకే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులను గెలిపించి తమ సత్తా చాటారని పేర్కొన్నారు. మళ్లీ రెండేళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారే వ్యక్తి అని, తెలంగాణ కోసం ఆయన ఎలాంటి త్యాగాలు చేయలేదని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది

Advertisement

తనకూ నోటీసులు ఇవ్వాలని ప్రయత్నించినా, తన తప్పులు ఎక్కడా దొరకలేదని స్పష్టం చేశారు. దళితులను, గిరిజనులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో తొర్రూరు మున్సిపాలిటీలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మించామని గుర్తు చేశారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో మంజూరైన 100 పడకల ఆసుపత్రి పనులు ఇప్పటివరకు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. దుబ్బ తండా నుంచి పాలకేంద్రం వరకు సెంటర్ లైటింగ్ మంజూరైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. తొర్రూరు ట్యాంక్‌బండ్ పనులు, కంటాయపాలెం–హరిపిరాల రోడ్ల పనులను మధ్యలో నిలిపివేశారని ఆరోపించారు. సొంత నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేని మంత్రి తొర్రూరులో ఏమి చేస్తారని ప్రశ్నించిన ఎర్రబెల్లి, జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో తొర్రూరులో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: Sobhita Dhulipala: నాగచైతన్యతో వివాహం తర్వాత శోభితా ధూళిపాళ కెరీర్ గురించి ఏం చెప్పిందంటే?

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×