E-Paper
Advertisement

ఓట్ల తొలగింపుపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్.. ‘ఎస్ఐఆర్’ పై కేటీఆర్ దిశానిర్దేశం!

ఓట్ల తొలగింపుపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్.. ‘ఎస్ఐఆర్’ పై కేటీఆర్ దిశానిర్దేశం!
Advertisement

GHMC Elections: స్వేచ్ఛ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠంపై మరోసారి గులాబీ ఎండాను ఎగురవేసేందుకు సిద్ధమవుతుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అప్పుడే తన వ్యూహాలకు పదును పెడుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆశించిన స్థానాలను సాధించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తన పట్టును మరింత సుస్థిరం చేసుకునేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఓటర్ల జాబితా సవరణ నుంచి సభ్యత్వ నమోదు వరకు ప్రతి అంశాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటూ కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ కేడర్ ను సమాయత్తం చేస్తూ క్షేత్రస్థాయిలో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు.

ఓట్ల తొలగింపుపై ప్రత్యేక నిఘా

Advertisement

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, తమ పార్టీ సానుభూతిపరులైన ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించకుండా బీఆర్ఎస్ పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఎస్ఐఆర్ ప్రక్రియపై పార్టీ శ్రేణులను పూర్తిగా అలర్ట్ చేసింది. ఈ నెల 25 నుంచి సర్ రాష్ట్రంలో ప్రారంభమవుతుండటంతో నేతలకు దిశానిర్దేశం చేస్తూంది. ప్రతి డివిజన్ లోనూ, ప్రతి పోలింగ్ బూత్ పరిధిలోనూ ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని కేడర్ కు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాల్లో వరుసగా సర్ పై సమావేశాలు నిర్వహిస్తున్నారు. అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి సూచనలు చేస్తున్నారు.

మానిటరింగ్ చేస్తున్న కేటీఆర్

Advertisement

ఎస్ఐఆర్ ప్రక్రియను మానిటరింగ్ చేసేందుకు బీఎల్ఎల లిస్ట్ ఇవ్వాలని గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలకు చెప్పింది. అయితే 119 నియోజకవర్గాలు ఉండగా 38 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఇంకా లిస్ట్ అందలేదని ఇటీవల కేసీఆర్ ఆయా నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్,ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం ఏర్పాటు చేశారు.ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నేతలకు ఎస్.ఐ.ఆర్ పైన కేటీఆర్ సూచనలు చేశారు. ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో భాగంగా గులాబీ క్యాడర్ ఎక్కువగా వున్న ప్రాంతాలపై ఫోకస్ పెట్టాలని అధిష్టానం ఆదేశాలు ఇచ్చారు.

కాంగ్రెస్ వైఫల్యాలే లక్ష్యంగా..

ప్రతి బూత్ లోనూ కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, అర్హులైన ఓటర్ల పేర్లు గల్లంతు కాకుండా చూసే బాధ్యతను ఈ బీఎల్ఏలకు అప్పగించారు. సరికొత్త ఓటరు జాబితా సవరణ కార్యక్రమాల్లో ఈ ఏజెంట్లు చురుగ్గా పాల్గొనేలా కార్యాచరణ రూపొందించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు వేచి చూడకుండా, రాబోయే గ్రేటర్ ఎన్నికల నాటికి పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండేలా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జీలు స్థానిక సమస్యలపై పోరాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గ్రేటర్ పరిధిలోని డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు, స్థానిక మౌలిక వసతులపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేస్తున్నారు.

కేటీఆర్ ప్రత్యక్ష మానిటరింగ్

ఈ మొత్తం వ్యవహారాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ భవన్ వేదికగా ప్రతి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో నిరంతరం సమీక్షిస్తూ, ఎక్కడికక్కడ లోపాలను సరిదిద్దుకుంటూ, కేడర్ లో జోష్ నింపేలా దిశానిర్దేశం చేస్తున్నారు. గులాబీ పార్టీ క్యాడర్ ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది..ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో అధికారులు అడిగే అర్హత పత్రాలు బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఓటర్ల వద్ద ఉన్నాయా లేవా ఒకవేళ అర్హత పత్రాలు లేకపోతే స్థానిక గులాబీ పార్టీ నేతలు వారికి అర్హత పత్రాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలకు కేటీఆర్ చెప్పారు. అదే విధంగా 2018,2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువ అసెంబ్లీస్థానాలు వచ్చాయి.

క్షేత్ర స్థాయిలో క్యాడర్ కు దిశానిర్దేశం

రెండు సార్లు గ్రేటర్ మేయర్ పీఠాన్ని గెలుచుకుంది. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్.ఐ.ఆర్ ప్రక్రియతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయని బిఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. దీంతో తమకు అనుకూలంగా ఉన్న ఓట్లు డిలీట్ కాకుండా ఉండే చర్యలు బిఆర్ఎస్ చేపట్టింది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఉన్న ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకు సైతం గులాబీ పార్టీకి అండగా నిలిచింది. పాత బస్తీ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో మైనారిటీ ఓటు బ్యాంకు బిఆర్ఎస్ పార్టీకి పడింది. దీంతో ఇప్పుడు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోటలేని చోట బూత్ ల వారీగా బీఎల్ఎలను నియమించి ఎస్.ఐ.ఆర్ లో గులాబీ పార్టీ అనుకూల ఓటు బ్యాంకును కోల్పోకుండా క్షేత్ర స్థాయిలో క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తోంది.

సభ్యత్వ నమోదుపై నజర్

ఓటర్ల జాబితా సవరణతో పాటు పార్టీ బలోపేతంపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. గ్రేటర్ వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించాలని కేటీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. డిజిటల్ పద్ధతిలో, క్షేత్రస్థాయికి వెళ్లి ప్రతి ఇంటిని టచ్ చేస్తూ సభ్యత్వాలు నమోదు చేయించాలని పార్టీ నేతలకు సూచించారు. ప్రతి డివిజన్‌లోనూ విస్తృతంగా సభ్యత్వ నమోదు చేపట్టాలని కేడర్‌కు సూచిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ముందస్తుగానే వ్యూహాలు రచిస్తూ గ్రేటర్ కోటపై మళ్లీ గులాబీ జెండా పాతాలని బీఆర్ఎస్ గట్టి పట్టుదలతో కనిపిస్తోంది. నేతలు ప్రజల్లో ఉండేలా, కేడర్ యాక్టివ్ గా ఉండేలా గులాబీ బాస్ లు వేస్తున్న అడుగులు నగర రాజకీయాన్ని ఇప్పుడే వేడెక్కిస్తున్నాయి.

Also Read: కెమిస్ట్రీ చదివి.. కల్తీ దందాకు తెరలేపాడు.. ఎన్సీబీ చేతికి చిక్కిన ‘అల్ఫ్రాజోలెం’ ముఠా

Tags

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×