Tim David: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Punjab Kings vs Royal Challengers Bengaluru) మధ్య 61వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో అద్భుతంగా రాణించిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఏకంగా 23 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విక్టరీతో నేరుగా ప్లే ఆఫ్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధించిన తర్వాత బెంగుళూరు ఆటగాడు టిమ్ డేవిడ్ మరోసారి రెచ్చిపోయి ప్రవర్తించాడు. మొన్న ముంబై ఇండియన్స్ జట్టును ఉద్దేశించి అసభ్యకరంగా వేలు చూపించిన టిమ్ డేవిడ్… ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటాను దారుణంగా ర్యాగింగ్ చేశాడు.
పంజాబ్ కింగ్స్ పైన 23 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు విజయం సాధించింది. చివరలో అజ్మతుల్లా ఒమర్జాయ్ క్యాచ్ అందుకున్న తర్వాత… పంజాబ్ ఓనర్ ప్రీతి జింటాను చూస్తూ తొడగొట్టాడు టిమ్ డేవిడ్. అంతకు ముందు హర్‌ప్రీత్ బ్రార్ ( Harpreet Brar) కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్లు తీసిన తర్వాత తొడగొడుతూ రెచ్చిపోయాడు. అయితే దానికి కౌంటర్ గా అజ్మతుల్లా ఒమర్జాయ్ క్యాచ్ పట్టిన తర్వాత బెంగళూరు ఆటగాడు టిమ్ డేవిడ్ కూడా అదే విధంగా పంజాబ్ గడ్డపై తొడగొట్టి కౌంటర్ ఇచ్చాడు. అయితే ఇక్కడ ప్రీతి జింటాను ఉద్దేశించి టిమ్ డేవిడ్ తొడగొట్టినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో టిమ్ డేవిడ్ పై ఖచ్చితంగా మరోసారి బీసీసీఐ యాక్షన్ తీసుకుంటుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ అంశంపై బీసీసీఐకి పంజాబ్ కింగ్స్ ఫిర్యాదు చేసే యోచనలో కూడా ఉందట. అదే జరిగితే టీమ్ డేవిడ్ పై యాక్షన్ ఉండనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో (Indian Premier League 2026 Tournament) భాగంగా పంజాబ్ కింగ్స్ పైన ( PBKS) ధర్మశాల వేదికగా బెంగళూరు ఘన విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ పైన 23 పరుగుల తేడాతో విజయం సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు… నేరుగా ప్లే ఆఫ్స్ లోకి దూసుకు వెళ్లడం జరిగింది. ఇక మిగిలిన మూడు జట్లు ప్లే ఆఫ్స్ కు రావాల్సి ఉంటుంది. ఈ మూడు స్థానాల కోసం సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడుతున్నాయి. ఈ టీమ్స్ లోనే మూడు ఫైనల్ అవుతాయి.
TIM DAVID THIGH CELEBRATION AFTER BEATING PUNJAB KINGS…!!! 🔥 pic.twitter.com/p6hFHDdJvI
— Johns. (@CricCrazyJohns) May 17, 2026
Tim david did this on zinta's face. Hope he doesn’t get fined again 😭 pic.twitter.com/suilr7vg65
— ` (@worshipVK) May 17, 2026