BigTV English

Medigadda Repair: మేడిగడ్డపై బీఆర్ఎస్ అబద్ధాలు.. ఎల్అండ్ టీ లేఖతో బయటపడ్డ నిజాలు..

Medigadda Repair: మేడిగడ్డపై బీఆర్ఎస్ అబద్ధాలు.. ఎల్అండ్ టీ లేఖతో బయటపడ్డ నిజాలు..

Medigadda Repair: అబద్ధం.. అబద్ధం.. అబద్ధం.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందంతా అబద్ధమని బట్టబయలైంది. కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ల భారం నయా పైసా ప్రభుత్వంపై పడదని అప్పట్లో బీఆర్ఎస్ ప్రకటించిందంతా బూటకమేనని తేటతెల్లమైంది. మేడిగడ్డ కుంగడంతో ఆ ప్రభావం ఎన్నికల్లో తమ పార్టీపై పడకుండా.. బ్యారేజీ నిర్మించిన ఎల్అండ్ టీ సంస్థనే రిపేర్లు చేసి ఇస్తుందని ప్రజలను నమ్మించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేసిందని.. అధికారులు, ఇంజినీర్లతో నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్పించిందని స్పష్టమైంది.


బ్యారేజీలోని ఏడో బ్లాక్ లో కుంగిన పిల్లర్ల రిపేర్లను నిర్మాణ సంస్థ ఎల్అండ్ నే చేస్తుందని అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పగా.. రిపేర్లతో తమకేమీ సంబంధం లేదని ఎల్అండ్ టీ కుండబద్దలు కొట్టింది. చేపట్టాల్సిన రిపేర్లకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. బీఆర్ఎస్ నేతలు చెప్పినట్టుగా డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఐదేండ్లు కాదని రెండేండ్లేనని.. ఆ గడువు కూడా ఈ ఏడాది ఫిబ్రవరితోనే ముగిసిందనే నిజాన్ని ఎల్అండ్ టీ వెల్లడించింది. బ్యారేజీ పునరుద్ధరణ పనులు చేయడానికి ఖర్చయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని.. అందుకోసం తమ సంస్థతో మళ్లీ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో మేడిగడ్డ రిపేర్ల భారం ప్రజలపైనే పడనుంది.

కాగా డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ముగిసిందని తెలిసినా ఎన్నికల్లో గెలుపు కోసమే…. అప్పటి కేసీఆర్ సర్కారు ప్రజలను తప్పుదోవ పట్టించిందనే విషయం ఇప్పుడు ఎల్అండ్ టీ లేఖతో బయటపడడంతో బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్న.. శాసన మండలిలో.. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో జరిగిన డ్యామేజీలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఈ విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.


శాసన మండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రసంగించే సమయంలో సీఎం రేవంత్‌ రెడ్డి మేడిగడ్డ గురించి వ్యాఖ్యానించారు. మేడిగడ్డ ఎందుకు కుంగిపోయిందో… ఎందుకు పనికి రాకుండా పోయిందో తెలుసుకుంటామని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక సభ్యులందరినీ మేడిగడ్డకు తీసుకెళ్తామని కూడా చెప్పారు.

ఈ ఏడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ ఏడో బ్లాక్ లోని పిల్లర్లు కుంగాయి. దీని వెనుక ఏదైనా కుట్ర ఉండొచ్చని మొదట ప్రాజెక్టు ఇంజినీర్లు పోలీసులకు కంప్లయింట్ చేయగా, సాంకేతిక కారణాలతోనే బ్యారేజీ కుంగినట్టుగా తేలింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్) చైర్మన్ ఆధ్వర్యంలోని ఎక్స్ పర్ట్ టీమ్ బ్యారేజీని పరిశీలించి డిజైన్ల లోపం, నిబంధనల మేరకు నిర్మాణం చేపట్టకపోవడంతోనే కుంగినట్టుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చింది.

.

.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×