Karimnagar BRS Sabha: కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్ సభలో అపశృతి చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నిర్వహించిన ర్యాలీలో ఓ యువకుడు బీభత్సం సృష్టించాడు. బుల్లెట్ వాహనం రేస్ చేస్తూ జనాలపైకి దూసుకెళ్లాడు. దీంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ను బుల్లెట్ వాహనం ఢీకొంది. దీంతో కానిస్టేబుల్ తీవ్రగాయాలు అయ్యాయి.
వివరాల ప్రకారం.. బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే సభ ప్రారంభానికి ముందు పార్టీ నాయకులు, కార్యకర్తలు మానేరు వంతెన నుంచి సభా స్థలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో పాల్గొన్న కరీంనగర్, కోతి రాంపూర్ కు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు తన బుల్లెట్ బైక్ తో ర్యాలీలో బీభత్సం సృష్టించాడు. బుల్లెట్ బైక్ ను ఒక్కసారిగా రేస్ చేస్తూ.. జనం పైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో అక్కడే విధులు నిర్వహిస్తున్న పద్మజా అనే కానిస్టేబుల్ ను బుల్లెట్ వాహనం ఢీకొంది. ప్రమాదంలో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడింది. ప్రమాదంలో గాయపడ్డ కానిస్టేబుల్ పద్మజను హుటా హుటిన నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కానిస్టేబుల్ కాలు విరిగినట్టు వైద్యులు తెలిపారు. దీంతో అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది శ్రీకాంత్ ను పట్టుకుని బుల్లెట్ బైక్ ను స్వాధీనం చేసుకుని అతడ్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ALSO READ: BOI Recruitment: మంచి అవకాశం.. డిగ్రీ అర్హతతో 400 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు