Nayanthara: సినీ పరిశ్రమలో గొడవలు అనేవి చాలా కామన్. దర్శకుడు, నిర్మాత, నటీనటులు.. ఇలా అందరి మధ్య మనస్పర్థలు రావడం అనేది చాలా కామన్. కానీ ఈ గొడవల గురించి పెద్దగా బయటికి రాదు. అప్పటికప్పుడు అందరూ కాంప్రమైజ్ అయిపోయి ముందుకు కదిలితేనే సినిమా కూడా ముందుకెళ్తుంది. కానీ తాజాగా సినిమా సెట్‌లో డైరెక్టర్, హీరోయిన్ మధ్య జరిగిన గొడవ వల్ల హీరోయిన్‌ను మార్చేయాలని డైరెక్టర్ ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. నయనతార. లేడీ సూపర్ స్టార్‌గా మారిన తర్వాత నయనతార చుట్టూ ఎన్నో కాంట్రవర్సీలు తిరుగుతున్నాయి. ఇప్పుడు తన ఖాతాలో మరో కాంట్రవర్సీ యాడ్ అయ్యింది.
షూటింగ్ మొదలు
ప్రస్తుతం నయనతార.. ‘మూకుతి అమ్మన్’ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘మూకుతి అమ్మన్ 2’లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ సినిమా ప్రారంభం అయ్యేవరకు ఇందులో నయనతారనే హీరోయిన్‌గా చేస్తుందా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. ఈ సీక్వెల్‌లో త్రిష హీరోయిన్‌గా నటిస్తుందనే వార్తలు కూడా కొన్నాళ్లు ఇండస్ట్రీలో వైరల్ అయ్యాయి. మొత్తానికి ఆ రూమర్స్ అన్నింటికి చెక్ పెడుతూ.. ‘మూకుతి అమ్మన్ 2’లో నయనతారనే హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యి.. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యంది.
మందలించడం నచ్చలేదు
సుందర్ సీ దర్శకత్వంలో ‘మూకుతి అమ్మన్ 2’ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుండగా షూటింగ్ సెట్‌లో ఏదో గొడవ అయ్యిందని కోలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. కాస్ట్యూమ్ విషయంలో నయనతారకు, అసిస్టెంట్ డైరెక్టర్‌కు మధ్య చిన్న వాగ్వాదం జరిగిందట. దీంతో ఈ విషయం నయన్‌కు నచ్చక ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌ను మందలించిదట. అలా చిన్న గొడవ కాస్త పెద్దగా అవ్వడంతో దర్శకుడు ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చాడని సమాచారం. సుందర్ సీకి నయనతార ప్రవర్తన నచ్చకపోవడంతో తనను సినిమా నుండి తప్పించి మరొక సీనియర్ హీరోయిన్‌తో మూవీ కంటిన్యూ చేయాలనే ఆలోచనలో ఉన్నాడని తమిళ పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ సీనియర్ హీరోయిన్ మరెవరో కాదు.. తమన్నా అని తెలుస్తోంది.
Also Read: దీపికాలో ఈ టాలెంట్ కూడా ఉందా.? కొత్తగా బయటికొచ్చిన షాకింగ్ విషయం..
నిర్మాత ఎంట్రీ
సుందర్ సీ (Sundar C)కి, నయనతార (Nayanthara)కు మధ్య మనస్పర్థలు మొదలవ్వడంతో ‘మూకుతి అమ్మన్ 2’ (Mookuthi Amman 2) షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీనివల్ల అత్యధికంగా నష్టపోయేది నిర్మాత కాబట్టి ఈ మూవీ నిర్మాత అయిన ఇషారీ కే గణేష్ ఈ సమస్యను పరిష్కరించడానికి రంగంలోకి దిగారట. ఇదే విషయంపై అటు సుందర్‌తో, ఇటు నయనతారతో చర్చలు జరిపి, మొత్తానికి షూటింగ్ మళ్లీ మొదలయ్యేలా సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పొలాచీలో జరగాల్సిన షెడ్యూల్‌ను క్యాన్సిల్ చేసి చెన్నైలోని అలపాక్కంలో ఉన్న పొన్నియమ్మన్ టెంపుల్‌లో షూటింగ్‌ను ప్రారంభించారు మేకర్స్. మధ్యలో తలెత్తిన సమస్య పక్కన పెడితే షూటింగ్ సాఫీగానే సాగుతుందని సమాచారం.