BigTV English

Meerut murder Case : జైలులో గంజాయి కోసం గొడవ – మీరఠ్ హత్య కేసు నిందితుల విచిత్ర ప్రవర్తన

Meerut murder Case : జైలులో గంజాయి కోసం గొడవ – మీరఠ్ హత్య కేసు నిందితుల విచిత్ర ప్రవర్తన

Meerut murder Case : ఉత్తర్ ప్రదేశ్ లోని మీరఠ్ లో సంచనలం సృష్టించిన మర్చంట్ నేవీ అధికారి హత్య కేసులోని ఇద్దరు నిందితులు తీవ్రమైన మాదకద్రవ్యల వినియోగానికి బానిసలుగా మారినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడింది. వీరిద్దరూ మర్చంట్ నేవీ అధికారిని హత్య చేసి పారిపోగా, పోలీసులు గాలించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టు ముందు హజరుపరిచి, రిమాండ్ లోకి తీసుకున్నారు. కాగా.. ఇప్పుడు వీరిద్దరు జైలులో విచిత్రం ప్రవర్తిస్తున్నారని, మాదకద్రవ్యాలకు బానిసలుగా మారి.. అవి దొరక్కపోవడంతో పిచ్చి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. మీరు అన్నం తినడం మానేసి తరచూ గంజాయి కోసం డిమాండ్ చేస్తూ గొడవ సృష్టిస్తున్నట్లుగా తెలిపారు.


సౌరబ్ రాజపుత్ర అనే వ్యక్తిని హతమార్చి ప్రియుడితో కలిసి హిమాచల్ ప్రదేశ్ లోని మనాలికి వెళ్ళిన ముస్కాన్ అనే యువతని, ఆమె ప్రియుడిని పోలీసులు రిమాండ్ తరలించగా అక్కడ వారు తీవ్రంగా ప్రవర్తిస్తున్నట్లు తెలిసింది. జైలుకు వచ్చిన మొదటి రోజు నుంచి నిందితుడు సాహిల్ ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలు పెట్టిందని పోలీసులు తెలిపారు. నిందితురాలు ముస్కాన్ సైతం ఆహారం తినకుండా తనకు గంజాయి ఇవ్వాలంటూ తీవ్రంగా గొడవ చేస్తుంది. జైల్లో గడిపిన మొదటి రోజు రాత్రి నుంచే.. వీరిద్దరు మాదక ద్రవ్యాల కోసం గొడవ చేస్తుండడంతో.. వైద్యులు తీవ్రమైన మాదకద్రవ్యాల వ్యసనానికి బానిసలైనట్లుగా గుర్తించారు.

నిందితురాలు ముస్కాన్ కు అత్యవసర చికిత్స అవసరమని భావించి.. ప్రత్యేక గదికి తరలించి వైద్య చికిత్స అందజేస్తున్నారు. ఇదే సమయంలో నిందితుడు సాహిల్ పురుషుల బ్యారెక్ లో గందరగోళం సృష్టించాడు. తనకి డ్రగ్స్ ఇవ్వాలని లేదా గంజాయి అయిన సమకూర్చాలని డిమాండ్ చేస్తున్నాడు. గంజాయి లేని కారణంగా యువకుడు తీవ్రంగా ప్రవర్తిస్తుండడంతో చుట్టుపక్కల వారిపై దాడులు చేసేందుకు సైతం సిద్ధమవుతున్నట్లు గుర్తించారు.


ఈ యువకుడు రోజూ గంజాయి, మార్ఫిన్ ఇంజక్షన్లకు అలవాటు పడినట్లుగా పోలీసులు గుర్తించారు. సౌరభ్ ను హత్య చేసినప్పుడు సైతం వీరిద్దరు గంజాయి మత్తులోనే ఉన్నట్లుగా గుర్తించారు. ఈ ఇద్దరు నిందితులు క్రమం తప్పకుండా ఇంజక్షన్లు, మందులు వంటివి వాడుతున్నట్లుగా వైద్యులు, జైలు అధికారులు నిర్ధారించారు. నిందితుల సంరక్షణలో భాగంగా వీరిద్దరిని… డీ అడిక్షన్ కేంద్రానికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. నిందితులు డిమాండ్ చేస్తున్నట్లుగా గంజాయి, మాదక ద్రవ్యాలు అందకపోవడంతో వీరిద్దరూ ఆహారాన్ని తీసుకునేందుకు నిరాకరిస్తూ జైలా అధికారుల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాగా.. వీరు సాధారణ స్థితికి చేరుకునేందుకు కనీసం 10 రోజులకు పైగా పట్టొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ముస్కాన్, ఆమె ప్రేమికుడు సాహిల్ తో కలిసి మార్చి 4 సౌరబ్ ను కత్తితో పొడిచే హత్య చేశారు. అతని మృతదేహాన్ని ముక్కలుగా నరికి డ్రమ్ లో దాచి, డ్రమ్మును సిమెంట్ తో నింపేశారు. ఆ తర్వాత ప్రేమికులిద్దరూ తప్పించుకునేందుకు హిమాచల్ ప్రదేశ్ పారిపోయారు. అక్కడ నుంచి మార్చి 17న మీరఠ్ కు తిరిగి వచ్చారు. హిమాచల్ పర్యటనలో వీరిద్దరూ హోలీ ఆడుతూ, కేకులు కట్ చేసుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చుకుంటూ సరదాగా గడిపినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.

Also Read : Cows Missing: తప్పిపోయిన ఆవులు.. సీసీటీవీ ఫుటేజ్ చూసి షాక్ అయిన యజమాని!

సౌరబ్ రాజ్ పుత్, ముస్కాన్ లు 2016 లో ప్రేమ వివాహం చేసుకున్నట్లు పోలీసుల తేలిపారు. సౌరభ్ మర్చంట్ నేవీలో ఉద్యోగం చేస్తుండగా.. వారికి 2019లో ఓ కుమార్తె జన్మించింది. ఈ క్రమంలోనే నిందితురాలు ముస్కాన్, సాహిల్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది గుర్తించిన సౌరభ్.. అనేక సందర్భాల్లో ఈ విషయమై  భార్యాభర్తల మధ్య తగవులు జరిగాయి. ఓసారి ఏకంగా విడాకులు వరకు వెళ్లినట్లు సమాచారం. కానీ కుమార్తె కోసం.. సౌరభ్ వెనక్కి తక్కి విడాకులు తీసుకోకుండా కాపురాని కొనసాగించాడు. ఇటీవల ఉద్యోగం నిమిత్తం దేశాలకు వెళ్ళిన సౌరబ్.. తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా తిరిగి వచ్చాడు. ఇలా మధ్యలోనే తిరిగి వచ్చి.. నిందితుల మధ్య వివాహేతర బంధానికి అడ్డుపడుతున్నారని భావించి..  సౌరభ్ ను  ఘోరంగా హత్య చేసి డ్రమ్ములో వేసి సిమెంట్ సీల్ చేశారు

Related News

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Big Stories

×