E-Paper
Advertisement

Cag report: రెనెన్యూ రాబడులు పెరిగాయి: కాగ్

Cag report: రెనెన్యూ రాబడులు పెరిగాయి: కాగ్
Advertisement

Cag report: రాష్ట్ర స్థితిగతులపై కాగ్ తాజాగా నివేదికను విడుదల చేసింది. తెలంగాణ అసెంబ్లీలో 2023 మార్చితో ముగిసిన ఏడాదికి సంబంధించిన రాష్ట్ర స్థితిగతులపై కాగ్ నివేదికను విడుదల చేసింది. రాష్ట్ర జీఎస్ డీపీ 2021-22తో పోలిస్తే 2022-23లో 16 శాతం పెరిగిందని కాగ్ పేర్కొన్నది.

కాగ్ నివేదిక వివరాలు ఇలా ఉన్నాయి.. ‘రెవెన్యూ రాబడులు గణనీయంగా 25 శాతం వరకు పెరిగాయి. రెవెన్యూ రాబడుల వృద్ధి రేటు ఒక శాతం మేర తగ్గింది. సొంత పన్నుల రాబడి కూడా గణనీయంగా 17 శాతం పెరిగింది. సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ. 2,06,977 కోట్లకు పెరిగింది. మార్చి 2023 నాటికి పూర్తి కావాల్సినటువంటి 20 ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరిగింది.

Advertisement

Also Read: త్వరలో స్పోర్ట్స్ పాలసీ, ఆటలపై మా దృష్టి-సీఎం రేవంత్

రూ. 2,749 కోట్ల వరకు ద్రవ్యలోటు తక్కువ చేసి చూపించారు. 2022-2023లో ప్రభుత్వం ఇచ్చినటువంటి రుణాలు, అడ్వాన్స్ లు 150 శాతం మేర పెరిగాయి. సొంత రాబడి లేని సంస్థలకు ప్రభుత్వం రుణాలను ఏర్పాటు చేసింది. 2022-2023 బడ్జెట్ వెలుపలి రుణాలు రూ. 1,18,629 కోట్లుగా అంచనాగా ఉంది. ఆయా రుణాలకు ప్రభుత్వం తదుపరి రుణాలుగా రూ. 17,829 కోట్ల వరకు అందించింది. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి రుణాలపై వడ్డీపై ఖర్చు తక్కువగా అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లను భారీగా అంచనా వేస్తున్నారు. ఏపీ నుంచి తెలంగాణ విద్యుత్ కంపెనీలకు ఎటువంటి బకాయిలు రాలేదు. గొర్రెల పంపిణీ, ఇళ్ల పంపిణీ, ఆయిల్ పామ్ పథకాల నిధులు ఖర్చు కాలేదు. దళితబంధుతోపాటు రుణమాఫీ పథకాలకు కేటాయింపుల్లో భారీగా ఖర్చు కాలేదు’ అంటూ కాగ్ తన నివేదికలో పేర్కొన్నది.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×