LSG – Kane Williamson: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కంటే ముందు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు (Lucknow Super Giants ) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే సీజన్ లో ఎలాగైనా టైటిల్ నెగ్గాలన్న కసితో ముందుకు వెళుతున్న లక్నో సూపర్ జెయింట్స్… తాజాగా కేన్ విలియమ్‌సన్ ( Kane Williamson)కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ అలాగే గుజరాత్ టైటాన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన కేన్ మామను జట్టులోకి తీసుకువస్తోంది లక్నో. అయితే ఈసారి బ్యాటర్ గా కాకుండా కొత్త అవతారంలో లక్నో జట్టులోకి వస్తున్నాడు కేన్ మామ. రిషబ్ పంత్ సారథ్యం వహిస్తున్న లక్నో జట్టుకుస్ట్రాటజిక్ అడ్వైజర్ ( Strategic Advising ) గా కేన్ మామను తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం.
Also Read: IND VS AUS: గంభీర్ కు చెప్పకుండానే ఆస్ట్రేలియాకు బయలుదేరిన రోహిత్, కోహ్లీ…సిరీస్ షెడ్యూల్ ఇదే
ఐపీఎల్ 2025 టోర్నమెంటులో అట్టర్ ఫ్లాప్ అయిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు (Lucknow Super Giants )ను గాడిలో పెట్టేందుకు ఓనర్ సంజీవ్ గోయెంకా ( Sanjiv Goenka) సంచలన నిర్ణయం తీసుకున్నారు. లక్నో స్ట్రాటజిక్ అడ్వైజర్ గా కేన్ విలియమ్‌సన్ ను నియమించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కెన్ మామతో చర్చలు కూడా జరిపింది లక్నో యాజమాన్యం. ఇటీవల కాలంలోనే లక్నో జట్టుకు సంబంధించిన మెంటార్ అలాగే బౌలింగ్ కోచ్ అయిన జహీర్ ఖాన్ తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే అతని స్థానాన్ని కేన్ మామ రూపంలో భర్తీ చేయాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుందట. దీంతో వచ్చే మినీ యాక్షన్ లో కేన్ విలియమ్‌సన్ సేవలు వినియోగించుకోవాలని లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అందుకే ఈ నెలలోనే అతని రేట్ ఫిక్స్ చేసి, జట్టులోకి తీసుకోబోతున్నారట.
అన్ సోల్డ్ ప్లేయర్ కేన్ మామను జట్టు కోసం తీసుకోవడంపై ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. సంజీవ్ గోయెంకా తెలివి తక్కువ నిర్ణయంతో కోట్ల నష్టం అంటున్నారు. గత ఏడాది ఐపీఎల్ లో ఎవరూ కొనుగోలు చేయని కేన్ మామను జట్టు లోకి తీసుకువచ్చి, ఏం చేస్తావ్ అని సంజీవ్ ను ప్రశ్నిస్తున్నారు. రిషబ్ పంత్ కు ఎక్కువ రేటు పెట్టి, నష్టపోయావ్… ఇప్పుడు కేన్ మామ ఎందుకు నీకు అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. కాగా ఐపీఎల్ 2025 కోసం జరిగిన మెగా వేలంలో కేన్ విలియమ్‌సన్ ను ఎవరూ కొనుగోలు చేయలేదు. ఇక అటు లక్నో కోచ్ గా జస్టిన్ లంగర్ పనిచేస్తుండగా బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్ ఫైనల్ అయ్యాడు. అలాగే అసిస్టెంట్ కోచ్ గా లాన్స్ క్లూసెనర్ ను తీసుకోబోతున్నారు.
🚨 LUCKNOW SUPER GIANTS 2026 🚨 [RevSportz]
Coach – Justin Langer
Strategic Adviser – Kane Williamson
Bowling Coach – Bharat Arun
Assistant Coach – Lance KlusenerKane Williamson will bring lots of experience to the team led by Rishabh Pant. 👌 pic.twitter.com/2aPYJ8gzIc
— Johns. (@CricCrazyJohns) October 16, 2025