Supreme Court: బీసీ రీజర్వేషన్లు అమలు చేయడానికి చిత్తశుద్దితో ప్రయత్నాలు చేశాం.. చేస్తూనే ఉంటాం అంటోంది కాంగ్రెస్ సర్కారు. చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించాలని రేవంత్‌రెడ్డి సర్కారు నిర్ణయించింది. 42 శాతం బీసీ రిజర్వేషన్ల నిర్ణయంపై స్టే విధిస్తూ, లోకల్ బాడీ ఎన్నికలపై హైకోర్ట్ స్టే రావడంతో.. ఇక ఆఖరి పోరాటంగా ఇక సుప్రీం గడప తొక్కాలని డిసైడ్ అయ్యింది. అందులో భాగంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు విచారణపై తెలంగాణ స్థానిక ఎన్నికల భవిష్యత్తు తేలనుంది.
లోకల్ బాడీ ఎన్నికలకు షెడ్యూలు విడుదల
ఇప్పటికే ఎన్నికల సంఘం లోకల్ బాడీ ఎన్నికలకు షెడ్యూల్డ్, నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు హైకోర్టు స్టేతో … ముందుకు వెళ్ళలేని పరిస్థితి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, న్యాయ నిఫుణులతో చర్చించారు. 42 శాతం బీసీ రిజర్వేసన్‌ల సాధన కోసం, చివరి ప్రయత్నంగా మరింత ముందుకే వెళ్ళాలని డిసైడ్ అయ్యారు.
సుప్రీం కోర్టుని ఆశ్రయించిన రేవంత్ రెడ్డి సర్కారు
ఎన్నికల్లో ఇచ్చిన మాటకోసం.. బీసీలకు 42 శాతం రిజర్వేసన్ల కోసం ఆఖరి పోరాటానికి సిద్దం అయ్యారు రేవంత్. అందులో భాగంగా సుప్రీం కోర్టుకు వెళ్ళాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. హైకోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది . ప్రభుత్వం తరుపున అభీషేక్ సింగ్వీతో పాటు సీనియర్ న్యాయవాదులు వాదించనున్నారు. బీసి రిజర్వేషన్ల నిర్ధారించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది..? ఎలా వ్యవహరించదన్న వివరాలను సుప్రిం కోర్టుకు సమర్పించి.. బలంగా వాదనలు వినిపించాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది
హైకోర్టు తీర్పును ఆయుధంగా మార్చుకోనున్న సర్కారు
మరోవైపు హైకోర్టు తీర్పును రాజకియ ఆయుధంగా మలుచుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్ ఆగి పోవడానికి బిజేపి కారణం అన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని డిసైడ్ అయ్యారు. బీసీ రిజర్వేషన్ బిల్లును, రాష్ట్రపతి, గవర్నర్ కు పంపించి నెలలు గడుస్తుంది. అంతేకాదు పంచాయతి రాజ్ చట్టం 285/ A సవరిస్తూ, ఆర్డినెన్స్‌ను సైతం రాజ్ భవన్ కు పంపించింది. అయితే ఈ రెండింటిని ఆమోదించకుండా కేంద్రం ప్రభుత్వం కావాలని టైం పాస్ చేస్తుందని రేవంత్ సర్కార్ బిజేపిని టార్గెట్ చేయనుంది.
Also Read: నేడు ఏపీలో ప్రధాని మోదీ పర్యటన.. మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఇదే..
ఇక బీజేపీ వంతే అంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం
ఇక బీసీ రిజర్వేసన్ లపై రాష్ట్ర ప్రభుత్వంగా తాము చేయాల్సిందంతా చేశామని, ఇక చేయాల్సింది బీజేపీ అని ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివరించనుంది. మరి సుప్రీం కోర్టులోనైనా… బీసిలకు రిజర్వేసన్ లపై రేవంత్ సర్కార్ కు ఉరట లభిస్తుందో.. లేదో చూడాలి. లేని పక్షంలో చివరి అస్త్రంగా స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్ల అమలుకు సిద్దమవుతోంది.
Story By Apparao, Bigtv