దేశ వ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై పరిశుభ్రతను పెంచడమే లక్ష్యంగా ఆసక్తికర కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా టోల్ ప్లాజాల దగ్గర ఎలాంటి అపరిశుభ్రత కనిపించినా, మరుగుదొడ్లు సహా టోల్ గేట్ పరిసరాలు నీటుగా లేకపోయినా ఫోటోలు తీసి తమకు పంపిస్తే వెంటనే రూ. 1000 బహుమతిగా అందిస్తామని ప్రకటించింది. ఈ డబ్బులను ఫాస్టాగ్ రీఛార్జ్ రూపంలో ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఇంతకీ ఈ బంపర్ ఆఫర్ ను ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఇక ఈ అవకాశం ఈ నెల 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఈ బహుమతి పొందాలనుకునే వాహనదారులు ముందుగా ఫాస్టాగ్ కలిగి ఉండాలి. ఆ తర్వాత ‘రాజ్ మార్గ్ యాత్ర’ అనే యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉండే టోల్ ప్లాజాల దగ్గగర అపరిశుభ్రమైన పరిసరాలు, మరుగుదొడ్లను జియో ట్యాగ్ తో పాటు టైమ్ కనిపించేలా ఫోటోలను తీయాలి. యాప్ లో తమ పేరు, లొకేషన్, వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ తో పాటు అడిగిన ఇతర వివరాలను పొందుపరిచి సబ్ మిట్ చేయాలి. ఈ ఫోటోలను పరిశీలించిన తర్వాత NHAI.. సదరు ఫాస్టాగ్ వినియోగదారులకు రూ. 1000 బహుమతిని అందిస్తుంది. ఈ డబ్బులను ఫాస్టాగ్ అకౌంట్ లోకి యాడ్ చేస్తుంది. ఈ డబ్బును చేతికి తీసుకునే అవకాశం లేదు.
Read Also: వావ్.. 7 వేల కిలోమీటర్ల బుల్లెట్ రైలు కారిడార్, అదిరిపోయే న్యూస్ చెప్పిన అశ్విని వైష్ణవ్!
ఈ అవకాశం కేవలం NHAI నిర్మించిన టోల్ ప్లాజాలు, మరుగుదొడ్లకు మాత్రమే ఉంటుంది. అదే సమయంలో ఒక వాహనం నెంబర్ మీద ఒకేసారి రివార్డును పొందే అవకాశం ఉంటుంది. ఒకే రోజు పలువురు యూజర్లు ఒకే టోల్ ప్లాజా లోని వాష్ రూమ్ ఫోటో పంపిస్తే, వాటిలో అత్యంత క్లారిటీ ఉన్న వాటిని మాత్రమే ఎంపిక చేస్తారు. ఇక టాయ్ లెట్లు ఎంత మేరకు శుభ్రంగా ఉందనే విషయాన్ని ఏఐ సాయంతో పరిశీలిస్తారు. మాన్యువల్ చెకింగ్ కూడా చేస్తారు. ఆ ఫోటోలు తప్పనిసరిగా ‘రాజ్ మార్గ యాత్ర’ యాప్ లో తీసి ఉండాలి. మార్పింగ్ చేసిన, ఫేక్ ఫోటోలను పంపితే ఈజీగా కనిపెట్టేస్తారు. జాతీయ రహదారుల పరిశుభ్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సో, ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా నేషనల్ హైవేస్ మీద ప్రయాణిస్తున్నట్లయితే, టోల్ ప్లాజా దగ్గర పరిశుభ్రత, టాయిలెట్ల పరిశుభ్రతను పరిశీలించాలి. ఒకవేళ ఏమాత్రం తేడాగా ఉన్నా, ఫోటోలు తీసి పంపిస్తే, రూ. 1000 రివార్డు పొందే అవకాశం ఉంటుంది. బెస్ట్ ఆఫర్ లక్!