E-Paper
Advertisement

Hyderabad: మాదాపూర్‌లో కారు బీభత్సం.. అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న కారు..

Hyderabad: మాదాపూర్‌లో కారు బీభత్సం.. అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న కారు..
Advertisement

Hyderabad: నగరంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. బైకులు, కార్లతో నానా హంగామా చేస్తున్నారు. హైదరాబాద్ లోని మాదాపూర్‌లో బుధవారం అర్ధరాత్రి ఓ కారు భీభత్సం సృష్టించింది. అతివేగంతో వచ్చిన కారు మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. మద్యం మత్తులో కారు నడిపి ఉంటారని పోలీసుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం తర్వాత కారుని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. వాహనం ఎవరు నడిపారన్న వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

మరోవైపు కరీనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. రామడుగు మండల కేంద్రానికి చెందిన సామంతుల శివాజీ.. నీలం అరుణ్ అనే ఇద్దరు యువకులు కరీంనగర్ నుండి సొంత ఊరి వైపు వస్తుండగా.. షానగర్ గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం వీరి బైక్‌ని ఢీ కొట్టింది.

Advertisement

Also Read: మెదక్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించలేదని యువతిపై..

అయితే రెండు వాహనాలు వేగంగా రావడంతో శివాజీ అనే యువకుడి స్పాట్ లోనే మృతి చెందాడు. కొద్ది సేపటి తర్వాత నీలం అరుణ్ ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి దేహాలను పోస్ట్ మార్టానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే యువకుల మరణించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరవతున్నారు.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×