BigTV English

TDP : హైదరాబాద్ లో టీడీపీ ర్యాలీపై కేసు .. సెక్షన్లు ఇవే..!

TDP : హైదరాబాద్ లో టీడీపీ ర్యాలీపై కేసు .. సెక్షన్లు ఇవే..!

TDP : అనుమతిలేకుండా హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహించడంపై తెలంగాణ టీడీపీ నేతలపై కేసు నమోదైంది. టీడీపీ హైదరాబాద్‌ నగర కార్యదర్శి జీవీ నాయుడిసహా పలువురు నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినందుకు బేగంపేట పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. ఎస్‌ఐ జయచందర్‌ ఫిర్యాదుతో క్రైం నంబర్‌ 531\2023 కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 341, 290, 21 రెడ్‌ విత్‌ 76 సీపీ యాక్ట్‌ కింద టీడీపీ నేతలపై కేసు నమోదైంది. సుమారు 400మంది ర్యాలీలో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు.


స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకో­ణం కేసులో అరెస్టయి 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు.. అనారోగ్య కారణాల తాత్కాలిక బెయిలు పొందారు. మంగళవారం జైలు నుంచి బయ­టకు వచ్చిన ఆయన బుధవారం హైదరాబాద్‌ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో దిగగానే టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు కాన్వాయ్‌ను అనుసరిస్తూ పార్టీ జెండాలు, ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. దీంతో ఆయన బేగంపేట నుంచి జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చేరుకోవడానికి మూడున్నర గంటల సమయం పట్టింది. ఇలా అనుమతుల్లేకుండా భారీ ర్యాలీ చేయ­­డంతో పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ నేతలు మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ కూడా ఉల్లంఘించారని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో సాధారణ సమయాల్లోనే ర్యాలీలు, నిర­సనలు, ప్రదర్శనలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. ఈ పరిస్థితుల్లో ర్యాలీకి అనుమతి కోసం రిటర్నింగ్ అధికారికి 48 గంటల ముందు దరఖాస్తు చేసు­కోవాలి.


మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు వైద్య పరీక్షల కోసం గచ్చిబౌలిలో ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. బుధవారం ఆయన ఇంటికి చేరుకోగానే ఏఐజీ వైద్యుల బృందం కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంది. వైద్యుల సూచనతో చంద్రబాబు ఏఐజీకి వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు.

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×