BigTV English

EC Grants Permission: రాష్ట్ర అవతరణ వేడుకలకు ఈసీ అనుమతి!

EC Grants Permission: రాష్ట్ర అవతరణ వేడుకలకు ఈసీ అనుమతి!

EC Grants Permission for TS State Formation day Celebrations: జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఈ సందర్భంగా జూన్ 2న సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ వేడుకలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరింది.


తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఆ రోజు గన్ పార్క్ లోని ఉన్న అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించనున్నారు.

అయితే, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉన్నాతాధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లపై సమీక్షించారు. తగిన విధంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు.


Also Read: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నాడు: మంత్రి జూపల్లి

వేదిక వద్ద ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలన్నారు. వేదిక వద్ద ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని, వేదిక వద్దకు ప్రముఖులు వచ్చి, పోయే సమయంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలకు ఎండ కొట్టకుండా తగిన విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఒకవేళ ఏమైనా సమస్య తలెత్తినా వెంటనే అది పరిష్కారమయ్యే విధంగా చొరవ తీసుకోవాలన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించనున్నామని ఆమె పేర్కొన్నారు.

Tags

Related News

By Poll Elections: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీజేపీ అభ్యర్తి ఫిక్స్.. ఎవరంటే!

Maoist Party Letter: కీలక నేతలను కోల్పోయాం.. లొంగిపోతున్నాం..! మావోయిస్టుల నుండి మరో సంచలన లేఖ

Hyderabad news: హైదరాబాద్-తిరుపతిలో అగ్నిప్రమాదాలు, భారీగా ఆస్తి నష్టం?

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఫోకస్.. కాంగ్రెస్ టికెట్ ఏ సామాజికవర్గానికి ఇస్తారు?

Hyderabad Rains: హైదరాబాద్‌పై వరుణుడి పంజా.. మూడు గంటల్లో 15 సెంటీమీటర్లు, నేడు-రేపు కూడా?

CM Revanth Reddy: పేదరిక నిర్మూలనకు విద్యే ఏకైక ఆయుధం: సీఎం రేవంత్ రెడ్డి

Weather News: మరి కాసేపట్లో ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షం.. పిడుగులు కూడా పడే ఛాన్స్

Birthday Bumps: బర్త్‌డే బంప్స్ అంటూ ‘అక్కడ’ కొట్టిన ఫ్రెండ్స్, చివరికి దారుణ పరిస్థితి

Big Stories

×