CV Raman Genius awards: విద్యార్థులలోని ప్రతిభను వెలికి తీయడానికి ఎప్పటికప్పుడు సూచిరిండియా ఫౌండేషన్ అధినేత లయన్ కిరణ్ (Lion Kiran) టాలెంట్ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా ప్రముఖ సామాజిక సేవ సంస్థ అయిన సూచిరిండియా ఫౌండేషన్ 32వ సర్ సి.వి. రామన్ టాలెంట్ సర్చ్ పరీక్షను జాతీయ అలాగే రాష్ట్రస్థాయిలో, వివిధ పాఠశాలలలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా 1000 పాఠశాలల నుండి దాదాపు లక్షమంది విద్యార్థులు ఈ టాలెంట్ పరీక్షలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల నుండి అలాగే రాష్ట్రాల పరిధిలో ఉన్న పాఠశాలల నుండి విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఇకపోతే జాతీయ రాష్ట్ర పరిధిలో నిర్వహించిన 32వ జాతీయ స్థాయి సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షలో కొంతమందికి గోల్డ్ మెడల్స్, మరికొంతమందికి నేషనల్ ర్యాంక్స్ తో పాటు రాష్ట్రస్థాయి మెడల్స్ అలాగే జిల్లా స్థాయి ర్యాంక్స్ వచ్చాయని సంస్థ నిర్వాహకులు వెల్లడించారు.
విజేతగా నిలిచిన విద్యార్థులకు సర్ సి.వి.రామన్ అవార్డుల ప్రధానం..
ఇకపోతే ఈ యువ టాలెంట్ విద్యార్థులకు పబ్లిక్ గార్డెన్స్ లలిత కళాతోరణం లో సర్ సి.వి.రామన్ యంగ్ జీనియస్ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. విద్యార్థులు ఈ పురస్కారాన్ని సాధించిన ఈ యువ ప్రతిభ వెనుక ఉన్న ఉపాధ్యాయులను ఇక్కడ సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswar Rao) సూచిరిండియా ఫౌండేషన్ నిర్వాహకులు లయన్ కిరణ్, సినీ నటుడు రావు రమేష్ (Rao Ramesh) ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సూచిరిండియా ఫౌండేషన్ నిర్వాహకులు లయన్ కిరణ్ చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సహాయం చేసే గొప్ప గుణం అందరికీ ఉండాలని తెలిపారు.