Pushpa 2 Collections: కొన్ని సినిమాలు కాంట్రవర్సీల వల్ల కూడా ప్రమోట్ అవుతాయి. విడుదలకు ముందు మూవీపై ఒక కాంట్రవర్సీ క్రియేట్ అయ్యిందంటే చాలు.. అది చాలావరకు సినిమాకు ప్లస్సే అవుతుంది. అలాగే అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ కూడా కాంట్రవర్సీల వల్లే ఫేమస్ అయ్యింది. సుకుమార్ (Sukumar), అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప’ మూవీ విడుదలయ్యి మూడేళ్లు కాగా.. అప్పటినుండి ఇప్పటివరకు దీని సీక్వెల్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు ఫ్యాన్స్. ఫైనల్‌గా ఇన్నాళ్ల తర్వాత విడుదల అవుతుంది అన్నప్పుడు దానిపై పెద్దగా హైప్ లేదు. మెల్లగా పలు కారణాల వల్ల అందరూ ‘పుష్ప 2’ గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అలా కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి.
రప్ప రప్పా కలెక్షన్స్
అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ఫ 2’ తానే చాలావరకు సోలోగా ప్రమోట్ చేసుకున్నాడు. తనతో పాటు రష్మిక కూడా ఈ ప్రమోషన్స్‌లో పాల్గొంది. సుకుమార్ మాత్రం చాలావరకు వేరే భాషలో జరిగే ప్రమోషన్స్‌కు అటెండ్ అవ్వకుండా చివరి నిమిషం వరకు మూవీ ఫైనల్ కాపీని ప్రిపేర్ చేయడంలోనే బిజీ ఉన్నాడు. అలా సినిమాకు సరిపడా ప్రమోషన్స్ జరగడానికి అల్లు అర్జునే కారణమయ్యాడు. కానీ మూవీ విడుదలయిన మొదటిరోజే దీనికి మిక్స్‌డ్ టాకే లభించింది. కేవలం బన్నీ ఫ్యాన్స్ తప్పా మరెవరూ సినిమా చాలా బాగుంది అని పెద్దగా చెప్పలేకపోయారు. అయినా కూడా కలెక్షన్స్ విషయంలో ‘పుష్ప 2’ తగ్గేదే లే అన్నట్టుగా దూసుకుపోయింది.
ఎన్నో అనుమానాలు
తాజాగా ‘పుష్ప 2’ క్లోజింగ్ కలెక్షన్స్ గురించి ప్రకటించారు మేకర్స్. ‘పాత రికార్డులను తుడిచేసి, కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్న పుష్ప 2 ది రూల్ ఇప్పటికీ ఇండియన్ సినిమాలో ఇండస్ట్రీ హిట్‌గా బలంగా నిలబడింది. పుష్ప 2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా రూ.1871 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. రికార్డ్స్ రప్ప రప్పా’ అంటూ ఈ కలెక్షన్స్ విషయాన్ని సంతోషంగా తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే మిక్స్‌డ్ టాక్ లభించినా.. కొన్నిరోజుల్లోనే థియేటర్లకు ప్రేక్షకులు రావడం ఆగిపోయినా ఇంత కలెక్షన్స్ రావడం ఎలా సాధ్యమయ్యింది అంటూ ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఇవి కూడా ఫేక్ కలెక్షన్స్ అయ్యిండవచ్చా అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
Also Read: నెక్స్ట్ మూవీలో హీరోయిన్ ఫిక్స్… రామ్ చరణ్ హీరోయిన్ తో బన్నీ రొమాన్స్ ?
అదే ట్రెండ్
ఈరోజుల్లో ప్రేక్షకులను అట్రాక్ట్ చేయడానికి, తమ సినిమా హిట్ అనిపించుకోవడానికి ఫేక్ కలెక్షన్స్ ట్రెండ్‌ను ప్రారంభించారు నిర్మాతలు. ఇక ‘పుష్ప 2’ (Pushpa 2) విషయంలో కూడా వేగంగా రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమా అంటూ ముందు నుండే పోస్టర్స్ విడుదల చేయడం మొదలుపెట్టారు మైత్రీ మూవీ మేకర్స్. దీంతో అప్పటినుండే దీనిపై అనుమానాలు మొదలయ్యాయి. ప్రేక్షకులంతా సూపర్ హిట్ అందిస్తే.. కలెక్షన్స్ ఈ రేంజ్‌లో రావడంలో ఆశ్చర్యం లేదు. కానీ మొదటినుండి అల్లు అర్జున్ ఫ్యాన్స్ తప్పా చాలావరకు మూవీ లవర్స్ మూవీ యావరేజ్ అనే అంటుండంతో నిర్మాతలు ప్రకటించిన ఈ కలెక్షన్స్ విషయంలో తేడాలు ఉన్నాయా అని చర్చలు మొదలయ్యాయి.
Shattering many records and creating new records, #Pushpa2TheRule stands tall as INDIAN CINEMA'S INDUSTRY HIT ❤️🔥#Pushpa2TheRule grosses 1871 CRORES WORLDWIDE 💥💥
RECORDS RAPA RAPAA 🔥#Pushpa2#WildFirePushpa
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/mWoLOa123e— Mythri Movie Makers (@MythriOfficial) February 18, 2025