BigTV English

Dec 1st Changes: డిసెంబర్ 1 నుంచి మారేవి ఇవే.. తప్పక తెలుసుకోవాల్సిందే..

Dec 1st Changes: డిసెంబర్ 1 నుంచి మారేవి ఇవే.. తప్పక తెలుసుకోవాల్సిందే..

Dec 1st Changes: ఒకటో తారీఖు వస్తోందంటే అంతా అలర్ట్. శాలరీ పడుతుందని కొందరు.. బిల్లులు కట్టాలని మరికొందరు.. ఒక్కొక్కరు ఒక్కో తరహా ఎఫెక్ట్ అవుతుంటారు. కానీ, అందరిపై ప్రభావం చూపే కొన్ని మార్పులు ఈ డిసెంబర్ ఫస్ట్ నుంచి మొదలు కానున్నాయి. అవి ఏంటో తెలుసుకోవాల్సిందే…


డిజిటల్‌ రుపీ..
రిటైల్‌ డిజిటల్‌ రూపాయి (ఇRs-ఆర్‌) ప్రయోగాత్మక ప్రాజెక్టును డిసెంబరు 1 నుంచి ప్రారంభించనుంది ఆర్‌బీఐ. మొదట 4 నగరాల్లో, ఆ తర్వాత మరో 9 సిటీస్ లో డిజిటల్ రూపీ సేవలను విస్తరించనున్నారు. ఇప్పటికే హోల్ సేల్ విభాగంలో నవంబర్ 1 నుంచి డిజిటల్ రూపీ అమల్లోకి వచ్చింది.

ఓటీపీ కంపల్సరీ..
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ PNB ఏటీఎంలో క్యాష్‌ విత్‌డ్రా నిబంధనలు మార్చింది. డెబిట్‌ కార్డుతో నగదు తీయాలంటే మొబైల్‌ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్‌ చేయాల్సిందే. మోసాల నుంచి వినియోగదారులకు రక్షణ కల్పించేందుకే ఈ మార్పులు చేసినట్టు బ్యాంకు తెలిపింది.


బ్యాంకులకు 13 రోజుల సెలవు..
డిసెంబర్ నెలలో 13 రోజులు బ్యాంకులకి సెలవులు రానున్నాయి. ఇందులో క్రిస్మస్‌తో సహా చాలా పండుగలు ఉన్నాయి. సంవత్సరంలో చివరి రోజు బ్యాంకులు మూసివేస్తారు.

శ్రీవారి బ్రేక్‌ దర్శన సమయం మార్పు..
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు ఒకటో తేదీ నుంచి బ్రేక్‌ దర్శన సమయం ఉదయం 8 గంటలకు మారనుంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో రాత్రివేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది టీటీడీ.

గ్యాస్ ధర మారేనా?
నవంబర్‌లో కమర్షియల్ గ్యాస్‌ సిలిండర్‌ ధరను ఆయిల్ కంపెనీలు రూ.115 వరకు తగ్గించాయి. డిసెంబర్‌ 1న మరోసారి రేట్లు సవరించనున్నాయి. ఈ సారైనా వంటింటి సిలిండర్‌ ధరను తగ్గిస్తారా?

ఆ బైక్స్ మరింత కాస్ట్లీ..
హీరో మోటోకార్ప్‌ తన మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను రూ.1500 వరకు పెంచనుంది. కొత్త ధరలు డిసెంబరు 1 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది.

రైళ్ల టైమింగ్‌లో మార్పు..
డిసెంబర్ నెలలో చలి, పొగమంచు కారణంగా చాలా రైళ్ల సమయాల్లో మార్పు ఉంటుంది. రైల్ జర్నీ చేసేముందు టైమింగ్స్ ఓ సారి చెక్ చేసుకుంటే బెటర్.

Tags

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×