E-Paper
Advertisement

Skin care : పెదాల పగుళ్లను నివారించే ఉప్పు

Skin care : పెదాల పగుళ్లను నివారించే ఉప్పు
Advertisement

Skin care : చలికాలంలో మన పెదాలు బాగా పగులుతుంటాయి. పొడిబారిపోయి అందవిహీనంగా కనిపిస్తాయి. మన ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతో పెదాలను మెరిపించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరినూనెలో కొంత సముద్రపు ఉప్పు కలిపి పెదాలకు పూసుకోవాలి. ఆ తర్వాత చల్లని నీళ్లతో కడిగేసేయాలి. రోజుకు రెండుసార్లు ఇలా చేస్తే పెదాల పగుళ్లను అరికట్టవచ్చు. రెండు చెంచాల సముద్రపు ఉప్పుతో సమానంగా బ్రౌన్‌ షుగర్‌, చెంచా కొబ్బరినూనె, రెండు చెంచాల ముడి చక్కెర కలిపి చర్మానికి రాసుకోవాలి. ఒక గంట తర్వాత చల్లని నీటితో కడుక్కుంటే చర్మం మీద ఉన్న డెడ్‌స్కిన్‌ పోతుంది. పొడి చర్మానికి ఇది చక్కటి పరిష్కారం. అంతేకాకుండా చర్మం మృదువుగా అవుతుంది. మన నోటిలోని సూక్ష్మక్రిములను తొలగించుకోవడంతో పాటు చిగుళ్లను బలోపేతం చేయడానికి గోరువెచ్చని నీటిలో వంటసోడా, సముద్రపు ఉప్పు కలిపి మౌత్‌వాష్‌గా ఉపయోగించుకోవచ్చు. అలాగే చిగుళ్ల నుంచి వచ్చే రక్తస్రావాన్ని కూడా అరికట్టవచ్చు. సముద్రపు ఉప్పును కొబ్బరినూనెతో కలిపి దాన్ని ముఖానికి రాస్తే చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది. చర్మంపై పగుళ్లు, మొటిమలను నివారించేందుకు చెంచా ఉప్పులో తగినంత తేనె కలిపి ముఖానికి రాయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×